మనుచరిత్రము (2-78) —
క. |
జైమిని యాదివ్యఖగ
గ్రామణులం జూచి వేడ్క గడలుకొనంగా
నా మీఁది వరూధిని విధ
మేమయ్యె నెఱుంగఁ జెప్పవే నా కనుడున్.
| 379
|
చేమకూరవారి విజయవిలాసము (3-50) —
క. |
వలపెక్కడ లేదా యీ
యలికుంతల తలనె పుడైనా యేచ కిఁకన్
జలిగాలఁ ద్రోచి విడువుము
చెలి మిక్కిలి మనసు పేద శీతలపాదా!
| 380
|
13. 'ఆశ్చర్యము', హల్లుకు —
రాజవాహనవిజయము —
ఉ. |
రామపయోధరంబు లదెరాఁ దనపై ఘనమయ్యె నంచుఁ దా
వేమరు వేరె రూపునఁ బ్రవీణతఁ గ్రిందొనరింప మేరు వు
ద్దామత నుండియుం గను స్వతంత్రులతో నఖవజ్రఘాతలన్
గ్రామము లెంత వింతలయిన న్మరి కర్మము లంత లింతలే.
| 381
|
మొదటి (చరణమందు) 382
అచ్చుకు —
చేమకూరవారి విజయవిలాసము (1-106) —
మ. |
ఒకమాణిక్యపుబొమ్మ యెట్టివగ కీలో జాలువా జాలవ
ల్లిక బాగా ల్కపురంపుటాకుమడుపు ల్వేతెచ్చి రాజున్న చా
యకు నందియ్య నతండు లేనగవుతో నవ్వేల నావ్యాలక
న్యక కెంగేల నొసంగఁ గైకొనియె సయ్యాటంబు వాటిల్లినన్!
| 383
|
మొదటి (చరణమందు) 384