|
పరమధర్మక్రియోపాయసంచితకీర్తి
యరిదుర్గసాధనోపాయవేది
వివిధశాస్త్రాగమవీక్షణతాత్పర్య
యిందిరాసత్కృపావీక్షణీయ
ప్రబలతరగుణా నిరంతరవైభవ
యష్టసిద్ధి బల నిరంతరాయ
సరగుచుండు నిమియ ప్రాదుల యతులన
విద్వదంబుజార విక్రమార్క.
| 65
|
రుక్మాంగదచరిత్రము (2–70) —
క. |
ఏ గృహపతిచే న
భ్యాగతుఁడు తిరస్కరింపబడుఁ, దన దురితం
బా గృహపతి కిడి చను న
భ్యాగతుఁడు తదీయసుకృతమంతయుఁ గొనుచున్.
| 66
|
హల్లులకు —
శ్రీనాథుని నైషధము (3-58) —
ఉ. |
దానకలాకలాపసముదంచితసారవివేకసంపదన్
మానితయాచమానజనమానసవృత్త్యభిపూర్తిబుద్ధి యె
వ్యానికి లే దొకింతయును వాఁడొకరుండు భరంబు ధాత్రికిన్
గానలు గావు శైలములు గావు పయోధులు గావు భారముల్.
| 67
|
మనుచరిత్రము (2-68) —
శా. |
ప్రాంచద్భూషణబాహుమూలరుచితోఁ బాలిండ్లు పొంగార మై
యంచుల్ మ్రోవఁగ గౌఁగిలించి యధరం బాసింప హా శ్రీహరీ
యంచున్ బ్రాహ్మణుఁ డోరమోమిడి తదీయాంసద్వయంబంటి పొ
మ్మంచున్ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్ ధీరచిత్తంబులన్.
| 68
|
వసుచరిత్రము (4-90) —
శా. |
మాయాశీలురు చంచలాత్ము లనుకంపాశూన్యు లాత్మైకకా
ర్యాయత్తుల్ సమయానుకూలహృదయవ్యాపారగోపాయనో
|
|