పుట:Sukavi-Manoranjanamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (1706)
సీ.

'ఏ నీ శుభాకార మీక్షింపఁ గన్నుల
             కఖిలార్థలాభంబు గలుగుచుండు...'

185
మరియును
క.

స్వరవర్గాఖండ ప్రా
ద్యురుబిందుపుతములుం బ్రయుక్తాక్షరముల్
బరువడి ఎక్కటి పోలిక
సరసమనఁగఁ బదివిధములఁ జను వడు లరయన్.

186
(అని లక్షణము చెప్పి—)
సిీ.

[1]అబ్జగర్భ శివ స్వరాఢ్య పూజ్యపదాబ్జ
             కవివర్గనుత గుణగణకలాప
వైభవాఖండ దేవాదిదేవ కృపాబ్ధి
             యఖిలవిప్రాదికప్రాణినిలయ
నుతపుణ్యహాస బిందుయుతా నవాంభోజ
             యతిదయాప్లుత నిజాత్మా మహాత్మ
చారు సంయుక్త నిశ్చల గుణాలంకార
             మహిమ నెక్కటి యైన మాన్యచరిత
పోల్చ నీ పోలికకు దైవములును గలరె
సరసగుణపాత్ర భక్తరంజనచరిత్ర
ప్రాస నిర్భిన్న చండతరామరేంద్ర
యఖిల యతిగమ్య రఘురామ యఘవిరామ.

187
  1. ఈ పద్యము 'కవిజనాశ్రయము'న కనుపించదు. ఆం.సా.పరిషత్ ప్రచురించిన క. జ. పు. 28లో అధోజ్ఞాపికయందు 'పదివళ్ళను, వాటి లక్ష్యములను జెప్పుచు రామస్తుతిగా నున్న భీమనచాటు వని ఈ పద్యమున్నట్లు వ్రాయబడినది.