పుట:Sukavi-Manoranjanamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
—"సందియంబు- ఈ రమణీయ" అని స్వరమున్నది. ఇది బిందుయతిచే నైన యఖండయతి. 'ఉపమింపగ' ననుచోట స్వరములేదు. నైషధమందు పద్యములు రెండు, సారంగధరచరిత్ర యందు నొకటియు, [1]నిదియు నొక విధమైనవి. కొందఱు ‘ఉపమ-ఇంపగ' అని స్వరమనుకొందురు. కాని,
సభాపర్వ మందలి 2-114
ఉ.

భావిపురాతనాద్యతన పార్థివలక్ష్ములు పాండవేయు ల
క్ష్మీవిభవంబుతోడ నుపమింప సమంబులుగా వశేష గా
జావలిలోన నత్యధికులైన సపత్నులపేర్మి సూచియేఁ
జూవె సహింపనోపక కృకుండ వివర్ణుఁడ నైతి నెంతయున్.

133
అను ఈ పద్యమున రెండవ చరణమందు "ఉపమింప"లో ఉపము-ఇంపగ అని స్వరము లేదని తేలును. 134
ఆదిపర్వము (6-200) నందే
ఉ.

క్రచ్చఱ నొక్కరక్కసుఁడు కాడు సురాసురులెల్ల నొక్కటై
వచ్చిన నీవ చూడఁగ నవార్య బలోన్నతిఁ జేసి వారలన్
వచ్చి వధింతుగాక యిటు వచ్చి శ్రమంపడి[2]యున్నచోట నే
నిచ్చగ వీరిదైన సుఖనిద్రకు భంగము సేయనేర్తునే.

135
చివర చరణమందు అఖండయతి.
అరణ్యపర్వము (2-248)
క.

అమరచరులందుఁ బురుషో
త్తముఁ డెట్లు విశేషమట్ల ధరణిం గల [3]తీ
ర్థములందును పుష్కరతీ
ర్థము గరము విశేష మభిమతార్థప్రదమై.

136
  1. ఇదే ఆశ్వాస మందలి 88, 90, 117వ పద్యములు.
  2. ము. ప్ర.'...యున్న నిచ్చట
    న్మెచగు వీరిదైన సుఖనిద్రకు...'
  3. ము. ప్ర. '...తీ, ర్థములందుఁ బుష్కరత్రిత
    యము, గరము విశేషమభిమతార్థ ప్రదమై'