పుట:Sukavi-Manoranjanamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. లుప్తవిసర్గకస్వరయతి

లక్షణసారము
గీ.

స్వరము తుదనుండి లుప్తవిసర్గ కోత్వ
మైన గూఢస్వరయతి దాసోహ మనఁగ
నచ్యుతాశ్రితు లుర్వి నన్యోన్యమిత్రు
లనఁగ నమ్మాధవుండు యశోబ్ధి యనఁగ.[1]

52
(లుప్తవిసర్గకస్వరయతినే) కొందఱు 'గూఢస్వరయతి' యని అంటారు. రెండు పేరులును గలవు.53
లక్ష్యములు
చేమకూరవారి విజయవిలాసము (1-49)—
శా.

తా సైరింప కపర్ణ యుండఁగ భవద్గర్భంబునం దాల్చి తే
జో౽సహ్యున్ శరజన్ము గాంచి యల నీహారక్షమాభృత్కుమా
రీసాపత్న్యము గన్నమోహపుఁ బురంధ్రీరత్న మౌ టీవ కా
వే సర్వజ్ఞుఁడు నిన్ను నేల తలపై నెక్కించుకో జాహ్నవీ!

54
—రెండవచరణమందు లుప్తవిసర్గకస్వరయతి, నాలవచరణమందు కాకుస్వరయతి.
  1. నన్నయ లక్షణసారము నందలి దీ పద్యమని కస్తూరి రంగకవి తన 'ఆనందరంగచ్ఛందము'న ఉదాహరించినాడు. కాని ఇది అనంతునిఛందమందు స్వల్పమైన మార్పులతో కన్పించును. రెండవపాదమున 'గూఢస్వరయతి'కి బదులు 'స్వరవిరామంబు' అని నాల్గవపాదమున 'యశోబ్ధి'కి బదులు 'యశోర్థి' యన్నవా మార్పులు (చూ. అనం.ఛం. 1-85) వేంకటరాయకవి రంగకవిని చూచి ఉదాహరించినట్లున్నది.