పుట:Sukavi-Manoranjanamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కొందఱు లాక్షణికులు స్వరయతి లక్షణము వ్రాసిన పద్యము —
క.

అ ఆ లై ఔలకు మరి
ఇ ఈలు ఋకార సహిత మె ఏఐకు నౌ
ఉ ఊల్ దమలో నొడఁబడి
ఓ ఓలకు వళ్లగున్ నయోన్నతచరితా![1]

ఈ పద్యచరణములందు ఆదిని నున్న అ ఆ ఇ ఈ - ఈ నాలుగున్ను, ఎ ఏలనుచోట ఎకారమున్ను గురువులు, ఏది హేతువుననైనవో తెలియదు. పామరులు బాలురకు చెప్పెడుపట్ల దగ్గిరనున్న ఆ ఈ ఊ ఓ — ఈనాలుగక్షరముల నూతగా నుచ్చరించుట మాత్రముచేత గురుత్వమొందవు. ఎకారమునకు ఆ పామరోక్తియు లేదు. పరిశీలించనందున లక్షణభంగమైనది. 30
స్వర ప్రధానవలులకు లక్ష్యములు :
శ్రీనాథుని కాశీఖండము (4-200)
గీ.

ఆదిగర్భేశ్వరుండౌట అనుచితంబు
మిగుల చక్కనివాఁ డౌట మేలుకాదు
పాప మభినవయౌవనోద్భాసి యగుట
యరయ మంచిగుణంబులే యవగుణములు.

31
రెండు యతులు.
అందే (7-95)
గీ.

ఈశ్వరద్రోహి గర్వాంధ ఋషివరేణ్య
బంధనాశైకకారణ పాపకర్మ
చావు మని యొక్కపెట్టున చక్రధార
దక్షుతలఁ ద్రెళ్లనేసెఁ భాలాక్షసుతుఁడు.

32
  1. ఇది కవిజనాశ్రయమున కన్పించును. సంజ్ఞ, 63. కస్తూరి రంగకవి 'భీమనచ్ఛందము'లోనిదిగా నీపద్యము నుదాహరించినాడు. (ఆనందరంగరాట్ఛందము. 3-114)