పుట:Subhadhra Kalyanamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54


తలపోసె మనసులో - తాళంగ లేక
యేమి వస్తువులైన - నియవచ్చు గాని
ప్రాణేశు నిచ్చి మరి - బ్రతుకంగ రాదు
అఖిలాండ కోటి బ్ర - హ్మాండనాయకుని
చెల్లెలు గనుకనే - నొల్ల ననరాదు
అదిగాక సభలోన - ఆ కౌరవులకు
మాన భంగము గల్గు - హీన కాలమున
మాన ధన మొసగిన - మాహత్మ్యశాలి
అటువంటి శ్రీకృష్ణు - కనుగు చెల్లెలట
అని మఱి తలపోసి - అతివ మోదించె
కేళికాగృహములో - క్రీయియు నపుడు
పరిహాసముగ ననియె - పణతితో నగుచు
కాడు చెయి బట్టిన - నాతిరోనీవు
విడిపించి లోపలికి - వేగ బోయితివి
యిపుడెందు బోయెదే - యిభ రాజగమన
కనుక సంతోషమ్ము - గానుండ తగును
ఓడక వచ్చి నా - యెద్ద గూర్చుండు
మన మఱి సుగ్గున - వనిత సుభద్ర
మగువ తా దివ్వెల - మాటుకే చనెను
కొనలు నిక్కగ వేయు - కుసుమాశ్రములన
బొమలు నిక్కగ వల - పుల చూపు చూచె