పుట:Subhadhra Kalyanamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53


శయ్యాగృహమునకు - నొయ్య బొమ్మనుచు
వెస సన్న పాదార - విందములు మ్రొక్కి
పానుపు కడకేగి - పార్థు డంతటను
యెదురు సూచు చుం నుండె - నింతి రాకలకు
మఱచిన తన్నింత - మఱవనీ కుండ
పచ్చని వింటి వా - డెచ్చరించుచును
వేదన కలవిచ్చు - విరహాగ్ని చాయ
ప్రోది చేసినయట్లు - పొదలె చంద్రుండు
అప్పుడాద్రౌపది - అతివతో ననియె
పట్నమ్ములో వారు - ప్రహరి దిరిగెదరు
పడతిరో పదునాఱు - ఘడియ లటు చనెను
సజ్జకు జనుమన్న - సకియ యప్పుడును
సిగ్గున్ మురిపెమున - చెలియ సుభద్ర
అడుగు లోడకయుండి - అటు కొంత సేపు
కూరిమి గలవాడు - కొమరాల నీకు
మేలిమి గలవాడు - మేనత్త కొడుకు
నాల్గు నెలల భిక్ష - మే ల్గల్గబెట్టి
యిప్పుడిటువలె సిగ్గు - లేటికే సుదతి
అనుచు సుభద్రను - అతివ తోడ్కొంచు
విజయుని పాంపున - వేడ్కతో నుంచె
తలుపు మూసికొని - తరుణి యేతెంచె