యపుడు శీఘ్రముగా దాని నణఁచివేయ,
మఱవకుఁడి దైవమును వేఁడ మగువలార! 5.
బంధుప్రీతి
తే.గీ. పుడమిఁ దలిదండ్రులును దోడఁబుట్టువులును
గాక, మిగులువా రెందైనఁ గలుగఁగలరు;
కావునను, వారియెడఁ బ్రేమ గలిగి యెపుడు
వారిమాటలో మెలఁగంగవలయుఁ జెలువ. 6.
ఆ.వె. అత్తమామలకును నాఁడుబిడ్డలకును
మనసు నొవ్వకుండఁ బనులు చేసి
నడుచు చుండవలయుఁ గడునడంకువతోడ
శ్రేయ మెదను గోరు చెలువ లెల్ల. 7.
తే.గీ. ఒక్కకడుపుననే పుట్టి, యొక్క కంచ
ముననె భుజియించి,యొకమంచముననె పండి
యుండు తోఁబుట్టుపడుచులు సోదరులును
నెప్పు డన్యోన్యమైత్రితో నొప్పవలయు. 8.
గురుభక్తి
తే.గీ. విద్యచెప్పిన గురువుల విషయమునను
మిక్కిలి కృతజ్ఞతను గల్గి మెలఁగ వలయు,
వారలే తమయుక్త ప్రవర్తనకును
దగుసహాయు లని యెఱింగి తరుణిమణులు. 9.
సత్యము
తే.గీ. సర్వశుభముల కాకర ముర్విలోన
సత్య మది లేనిచో ధర్మసమితియెల్ల
వ్యర్థ మగుఁ; గావున నసత్య మనెడుపేరు
మీదుచెవి సోఁక కుండంగ మెలఁగ వలయు. 10.
పుట:Stree Neetideepika.pdf/3
Appearance
ఈ పుట అచ్చుదిద్దబడ్డది