పుట:Stree Neetideepika.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దెలుపఁబోకుఁడు మీ రెందుఁ దెఱవలార!
తెలిపినను నిందపా లౌరు రిలను మిగుల. 92.

ఆ.వె. ఇద్ద ఱొక్కచోట నేకాంత మాడంగఁ
బొంచి వినఁగ రాదు మించుబోఁడి!
వినుచు నున్నయపుడు కనిరేని వారలు
కలహ మొదవుఁ జుమ్ము కలువకంటి! 93.

తే. గీ. ఇరుగు పొరుగు నారులకడ నించు కైనఁ
బరుష వాక్యంబు జిహ్వాగ్రభాగ మెపుడు
కదియ నీయక వారితోఁ గలసి మెలసి
యెల్ల రౌనన మెలఁగంగఁ జెల్లు సతికి. 94.

తే. గీ. పఙ్క్తి భేదంబు సేయక పదిగ నరసి
యందఱకు నేకరీతిగా ననువుమీఱ
భక్ష్యభోజ్యముల్ వడ్డింప వలయుఁ జూవె
కీర్తికే యాశ పడునట్టి కీరవాణి. 95.

ఆ.వె. పుట్టినింటివారు భువిలోన శ్రీమంతు
లగుచు నున్నఁ గాని యందు, బోక
నెలఁత యెపుడు మగఁడు నిరుపేద యైనను
నిలువ వలయు నతని నెలవు నందె. 96.

తే.గీ. ఖ్యాతియైన నపఖ్యాతియైనఁ బతికి
భార్యమూలముగా నెప్డు వచ్చుఁగాన,
లేశ మైనఁ బ్రమాదంబు లేకయుండఁ
దెఱవ సన్మార్గమునఁ బ్రవర్తింప వలయు. 97.

తే.గీ. కుట్టుపనులను నేరుచుకొని నెలంత
తనదు రవికలు బట్టలు తానె కుట్టు