పుట:Srivemanayogijiv00unknsher.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు దోప "లే లెం"డని పలికెను. వేమన్న క్షమించితి నని యనునంతవఱకును మీపాదములను విడువననెను. అభిరామయ్య "మీరు ప్రభువులు క్షమించుటకు నేనెవ్వడ"నని పలికెను. ఇట్లు విడువనని వేమన్నయును లెండని యభిరామయ్యయును వాదించు చుండగా నింతలో నాసమాచారము నాలుగుదిక్కులకును బ్రాకి రాజుగారు కూడ నచ్చటికే వచ్చుట తటస్థించెను. చిట్టచివఱకు అందఱుజేరి ఎట్లో యభిరామయ్యగారి చేత క్షమించితి ననిపించిరట! వేమన యంతట కాళ్లను వదలిపెట్టి చేతులను కట్టికొని మొదటనుండి తానుచేసిన పనియును అభిరామయ్యను మోసపుచ్చుటయును శివయోగిగారు తన కుపదేశించుటయును మున్నుగా నంతయును చెప్పి వైచెను. అందఱు నాశ్చర్యాంబునిధి మగ్నులైరి. అభిరామయ్య భరింపరాని చింతచే స్థబ్ధుడయ్యెను.

కనుగొన లశ్రుకణపూరితములుకాగా పెదవులు దడదడమని యదరుచుండ నేమియోమాటలాడ దలంపుగలవానిబోలి యున్న యభిరామయ్యవైపు మన వేమన మఱియొక మారు చూచెను. "అభిరామయ్యా! ఇంకనునన్నుక్షమింపనే లేదా? నేనుపశ్చాత్తప్తుడనై నీఱగుచున్నాను. అయినను నీయందింతటి ద్రోహము నొనర్చుటవలన నేనధికముగానే శిక్షింపబడవలసియుండు ననుట నిజము. నేనిట్లుపదేశము