పుట:Srivemanayogijiv00unknsher.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొందుట స్వప్రయోజనాకాంక్షచేతకాదు. ధనార్జన బుద్ధిచేత గాదు. ధనములలోనికెల్ల నుత్తమధనమై మనలనిర్వురును మోక్షార్హులనుగా నొనర్చి యద్వితీయమై యనశ్వరమై కల్పాంతస్థాయియగు బ్రహ్మముతో కైవల్యము నొందించుటకే నేనిట్లు చేసితిని. దీనివలన నీకునునాకును తరణోపాయము ఘటిల్లును. అజరామరణమును ననంతఫలదమునగు యశ: కాయము దీనిచేతనే మనయిర్వురకు లభింపగలదు. శాశ్వతమగు కార్యము దీనివలన చేకూర్చెదను. ఎట్లని యనియెదవా వినుము అభిరాముడును నామమాది యందు నటు పైనినాపేరును గలసి వచ్చునట్టులును ఆంధ్రదేశములోనిజనులు "వీరుపండితులు వీరుపామరులు, వీరుజ్ఞానులు, వీరజ్ఞానులు, వీరు బ్రాహ్మణులు, వీరన్యులు" అనుభేదమొకించుకయైనను లేక ఈజాతి యనక యెల్లవారును ఇప్పు డప్పు డనక భూతకాలమునను, వచ్చు కాలమునను, రాబోవుకాలమునను ఈతెగయాతెగయనకుండ స్త్రీలు బాలుర వృద్ధులు మున్నగువారు సర్వులును ఎల్లప్పుడును స్మరించునట్లుగా - "విశ్వదాభిరామ వినురవేమ!" యను మకుటముతో నీతి, మత, జాతుల దెల్పునదియును భుక్తిముక్తుల నిచ్చునదియును. రక్తివిరక్తుల నొసగునదియు నగునొకప్రబంధమును కొన్నివేలపద్యములతో వెలయించెదను. ఇదిగో యంజలి పట్టితిని