పుట:Sringara-Malhana-Charitra.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎఱ్ఱనార్యుని యితరకృతి

ప్రబంధరత్నావళియందు ‘కుమారనైషధము’ నీతనికృత్యంతరముగఁ బేర్కొని యందలిపద్యములను గొన్నిటిని జగన్నాధకవి చేర్చినాఁడు. మల్హణచరిత్రమున నెఱ్ఱన తాను ‘సరసకవితాచతురుండ’ ననిమాత్రము చెప్పికొనెను గాని యితరకృతిని రచియించినట్లు చెప్పలేదు. ‘కుమారనైషధము’ నందలి యాపద్యము లిందలి పద్యములకంటెఁ బ్రౌఢములుగఁ జూపట్టుచున్నవి. ఆకృతిని దీనికిఁ దరువాత రచియించినాఁడేమో?

మలహణచరిత్రము

ఇందలి యితివృత్తము శివభక్తిమాహాత్మ్యప్రతిపాదక మయినది. కథానాయకుఁడు సుప్రఖ్యాతసంస్కృతకవియగు మలహణుఁడు. కథానాయిక పుష్పగంధియను వేశ్య. ఈకథ పాల్కురికి సోమనాథకృత మగు పండితారాధ్యచరిత్రమునఁ గలదు. అం దీవిధముగ నున్నది:

“శివభక్తుడు, కవియు నగు మలహణుఁడనునాతఁ డొకవేశ్యను ప్రేమించి దానిని గూడియుండెను. మాయలమల్లియను సానితల్లి వారిపొందున కిచ్చగింపక యాతనిఁ బడఁదిట్టి పోఁద్రోలి కూఁతు నొకమండలాధిపతికిం గూర్చెను. మలహణుఁడు వేశ్యావియోగమును భరింపఁజాలక, దానిని మఱలఁ బొందు మార్గమునుగానక మిగుల బొక్కుచు దాని పలుకులనైన విని కొంత మనశ్శాంతిని బడయవచ్చునని తలంచి యొక చీకటిరేయిని