పుట:Sringara-Malhana-Charitra.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుత్త్రుఁ' డనియుఁ దెలియవచ్చుచున్నది. ప్రబంధరత్నావళియం దీతనియింటిపేరు 'పెదపాటి' వారని కలదు. “పాటిగలట్టిమేటి యెడపాటిపురాధిప యెఱ్ఱనార్య' అనునిందలిపద్యమున 'ఎడ' యనుచోట 'పెద' యున్నను పద్యము సరిపోవును. కాని ఆశ్వాసాంతగద్యములయందు సైత మిందు 'ఎడ' అనియే యున్నది. పెదపాడు[1] కృష్ణామండలమున ఏలూరునకు సమీపమున నున్నది. 'ఎడపాడు' ఎచ్చటనున్నదో! ఈ సంశయమునుదీర్ప నుపలబ్ధములగు నాధారములు చాలవు.

కృతిపతి

ఈగ్రంథమునకుఁ గృతిపతి చుండి కాళనమంత్రి. ఈతఁడు నియోగిబ్రాహ్మణుఁడు; సోమాంబారామయామాత్యుల పుత్త్రుడు; శివభక్తిపరుఁడు. ఎఱ్ఱనార్యుఁ డీతని ఘనసంపద్వైభవోపేతుఁ డనియు, నెఱదాతయనియు, బంధుప్రియుఁడనియు, కవిపండితపోషకుఁడనియు, యోధాగ్రేసరుఁడనియు, దేశాంతరాస్థానకవివరవర్ణనీయగుణగణుఁ డనియు వర్ణించినాఁడు. మఱియు నీతని 'చుండిపురపాలక', 'చుండిపురాధిప' అనియు, కొండొకచో 'చుండిస్థలగ్రామణి', 'చుండిస్థలకరణచంద్ర' అనియుఁ బేర్కొన్నాఁడు. 'చుండి' నెల్లూరుమండలమున నెల్లూరుపురమునకుఁ జెంతనున్న యొక చిన్నసంస్థానము. దీని నైదాఱుశతాబ్దములనుండి బ్రాహ్మణులు పరిపాలించినట్లు తెలియ

  1. ప్రబంధరత్నావళి పీఠిక - పే. 3.