పుట:Srinadhakavi-Jeevithamu.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
86
శ్రీనాథకవి


రణ గౌరవములఁ బడయుటకై యెక్కడనో దూరమున నున్న కొండ వీటికిఁ గుమారగిరి రెడ్డి పాలనము క్రుంగిపోయిన కాలమున, అవచితిప్ప య సెట్టి కొండవీకును వీడి వెడలిపోయిన కాలమున నేల కొండవీటికి బోవలసిన వాడయ్యెనో యూశ్చర్యకరముగా నున్నది. వింతలలో వింత మఱియొక్క వింత. "కాటయవేమన కొండవీట నున్న కాలముననే, కొమరగిరి జీవించి యుండఁగనే శ్రీనాథకవిరత్నము కొండవీటికి వచ్చుచు బోవుచునుండి యుండునని నాతలంపు,” అని చదువరులకుఁ గాని చరిత్ర పరిశోధకులకుఁ గాని యెట్టి సంశయము పుట్టకుండ వలయునని యింకొక మాఱు విస్పష్ట పఱచిరి. “దీని భావమేమి తిరుమలేశ" అని ప్రశ్నింప వలసి వచ్చు చున్నది. పదునాలు గేండ్ల వయస్సునకుఁ బూ ర్వమే మరుత్త రాట్చరిత్రము రచించి ప్రఖ్యాతి గాంచుటకుఁ బూర్వమే, మిక్కిలి బాలుఁడుగ నున్న శ్రీనాథ కవిరత్నము కుమారగిరి సలుపు వసంతోత్సవముల సందర్శించుటకై కొండవీటికి వచ్చుచుఁ బోవుచు నున్న వాఁడయినను కాటయ వేమనను గాని వాని మంత్రియగు రాయని భాస్కరునిగాని సందర్శించు భాగ్యము పట్ట లేదని యు, అట్టి భాగ్యము 1398 వ సంవత్సర ప్రాంతముల రాజమహేంద్ర పురమున నాకవిరత్నమునకు లభించినదని మనము గ్రహింపవలయును. పదునై దేండ్లు నిండిన వెనుక పెన్నిధులవంటి వారయిన కోటయవేమా 'రెడ్డి, రాయనభాస్కరుల: ప్రొపును విడనాడుకొని కుమారగిరి ప్రభుత్వ మంతమునొంది కొండవీడు రాజ్యము కల్లోలమై పెదకోమటి వేమారెడ్డి యాకల్లోలములో రాజ్యమాక్రమించుకొనఁబోవు కాలమున శ్రీ నాథకవి రత్నము. రెడ్ల ప్రాఫునకై కోండవీడుచేరెనట! ఎంతచమత్కారమైన విమర్శ ! మామిత్రులు తమ గ్రంథమునకు 'నేతిబీర ' వంటిదని తమకు తామే చెప్పికొన్న 'శృంగార శ్రీనాథ ' మను పేరు పెట్టుటకంటే “చమత్కార ప్రభాకర ' మాను పేరు పెట్టియుండిన నెంతయు నొప్పియుండునుగదా.