పుట:Srinadhakavi-Jeevithamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

87


ఆహా! హరవిలాసములోని 'బాలసఖుం' డను శ్రీనాథుని పద ప్రయోగ మెట్టెట్టి మేధావంతులనయినను 'టెంకాయపిచ్చికుండ' లని పిలచు చున్న దే!


శాలివాహన సప్తశతి.

నేలవిడిచి సాము చేయుటవలనఁ బ్రయోజనము లేదు. 'బాల్యమున శ్రీనాథుఁకు కొండవీడుననే యుండెను. ఆకాలముననే కాటయ వేమా రెడ్డి మంత్రియగు రాయని బాచని పాపున వర్ధిల్లుచుఁ బదునాలు గేండ్ల ప్రాయమువాఁడయియుండగా నవచితిప్పయ సెట్టితోడిమైత్రి ప్రారంభమై యైదాఱుసంవత్సరముల బాటు నడిచెను. కుమారగిరి చేయు వసంతో త్సవములును, తిప్పయ పెట్టి వసంతోత్సముల యందు దనకవితాప్రజ్ఞ ప్రదర్శనమునకు మెచ్చి తనకుఁజేయు సత్కారములును శ్రీనాథకవి భావి జీవితమునకు నొకవింతశోభను గలిగించినవి.


ఈ వసంతోత్సవములే యీకుమారగిరి జీవిత మేమన 'బాలకవి శ్రీనాథుని శాలివాహన సప్త శతి' యను రసోత్తరశృంగార ప్రబంధము ను నాంధ్రీక రింపఁబురికొల్పినది. ఈగ్రంధము ప్రాకృతభాషలో 'హాలు డకు నొక యాంధ్ర రాజుచే వ్రాయబడినది. దీనికి 'గాథాసప్తశతి యని నామాంతరముగలదు. ఇందు 200 గాథలు గలవు. భావపూరిత ములయిన చిన్న పద్యములతో గూడియున్నది. ఇందులోకవృత్తమను దెలుపు గాథలు కొన్ని యున్నను వివిధ రీతుల జమత్కరించి వివరించెడి వివిధనాయికా నాయకాదుల శృంగార వృత్తులను దెలిపెడి గాధల నేకము లందున్నవి. అయ్యవి కథావస్తు సూత్రైతములుగావు. అందుశృంగార రసము పొర్లి పోవుచుండుననుటకు లేశమాత్రమునుసందియము లేదు. మన శ్రీనాథుఁడు నూనూగు మీసాల నూత్న యావనమున 'శాలివాహన సప్త శతినొడివితి' ననియీగ్రంథమును రచించినట్లు చెప్పుకొనియున్నాడు కసుక 'నీగ్రంధమును బదునెనిమి దేండ్ల ప్రాయమున రచించినాడని