పుట:Srinadhakavi-Jeevithamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాధ్యాయము

61


కొండవీటి రాజధానియందు నివసించియుండునని యూహ పొడమక నూనదు. అనేక హేతువుల చేత కుమారగిరి రెడ్డి కాలములో కొండ వీటి రాజధానియందు నివసించియుండెనని మనము నిర్ధారణము సేయవ చ్చును. ఇన్ని విద్యలు నేర్చిన శ్రీనాథునికి గురు వొక్కఁడే యుండి యుండడు. శ్రీనాథుఁడు వేర్వేఱు గురువుల-కడ పేఱవేఱ శాస్త్రముల నభ్యసించియుండును. కొన్నిటిని స్వయముగా సభ్యసించినను పెక్కు. శాస్త్రములను గురుముఖమున సభ్యసించినఁ గాని యంతటి పొండిత్య ము సలవఱచుకొని యంతటి ఖ్యాతిని గాంచి యుండఁడు. ఆ నేకులకడ విద్యాభ్యాసము జేసియుండుట చేతనే శ్రీనాథకవి ప్రత్యేకముగా నొక్కని నామమైనఁ బేక్కొనకుండుటకుఁ గారణ మైయుండును. శ్రీనా థకవికి బాల్యమునందు విద్యాభిలాష యత్యధికముగా నంకురించి ప్రోత్సహించుటకుఁ గారణము శ్రీనాథుని పితామహుఁడైన కమలనా భామాత్యుని జీవితమై యుండ నసుటకు లేశమాత్రమున సంశయము లేదు. శ్రీనాథుఁడు తన తాతగారి జీవితము నాదర్శము గాఁ బెట్టుకోని విద్యాదీక్ష గైకొని కష్టములు కోర్చి యత్యధిక పరిశ్రమమును గావించి విద్వల్లోక మగ్గించునంతటి విద్వాంసుఁ డయ్యెను.

నేనీ కవిచరితమును బ్రకటించిన వెనుక నైదు సంవత్సరము లకు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు 'శృంగార శ్రీనాధ. మను పేరిట నీ కవిచరిత్రమునే ప్రకటించిరి. అందు "విద్యాభ్యాసము --- గురువు” అను శీర్షిక క్రింద నాయభి ప్రాచుముల నొప్పుకొనుచు నొప్పు కొనని వానివలె, జదువరులు తలంపవలయుని కాబోలు విచిత్ర మైన వ్యాఖ్యానము విస్తరింపఁ జేసియున్నారు.

“కుశాగ్రబుద్ధియు నద్భుత ప్రతిభాశాలియునగు నీతఁడు పలు వురు గురుల యొద్ద గురుకుల వాస క్లేశమునకు లోనయి చిరకాలము జాడ్యముతో విద్యాభ్యాసము చేసెనని తలంప రాదు." అనివ్రాసి