పుట:Srinadhakavi-Jeevithamu.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
62
శ్రీనాథ కవి


నది, ఇన్ని విద్యలు నేర్చిన శ్రీనాథునికి గురువొక్కఁడేయుండి యుండడు. శ్రీనాథుఁడు వేర్వేరు శాస్త్రముల నభ్యసించి యుండును; కొన్నిటిని స్వయముగా నభ్యసించినను పెక్కు శాస్త్రములను గురుముఖమున నభ్యసించినగాని యంతటి పాండిత్యము నలవటి చికొని యంత ప్రఖ్యాతిని గాంచియుండఁడు; అనేకులకడ విద్యాభ్యాసముఁ జేసియు డుటచేతనే శ్రీనాథకవి ప్రత్యేకముగా నొక్క నినామమైన బేర్కొనకుం డుటకుఁ గారణమై యుండు' నని 'నేను వ్రాసిన దానికి ఖడనముగా వాసియున్నారు. వీరే యీసందర్భమున నే మఱియొక చోట “ఉత్తమ కవితకు సహజశక్తి, లో కానుభవాదులమున నైపుణ్యము కావ్యజ్ఞ శిక్ష. యావశ్యకము. సంస్కృత ప్రాకృతాని భాషలలో, బరి జ్ఞానపాటవము", తర్క, వ్యాకరణాది శాస్త్రములందుఁ దలస్పర్శముగు వైదుష్యము, పండితులతో శాస్త్రార్ధములు సల్పఁజాలీన పాండితీ ప్రౌడి వయిపయి పూత మెఱుంగు చాతుర్యముతో నలవడఁదగినది కాదు. సకలవిద్యాసనాధుఁడై యితఁడిక ముందు కోమటి వేమారెడ్డి యాస్థానమున విద్యాధి కార్యున్నతోద్యోగము వహింపనున్నాఁడు. మఱియు డిండిమభట్టారకాదులతో విద్యావివాదములు సలుపనున్నాడు. ఇట్టివాడు గట్టిగా గురుశుశ్రూషతో శాస్త్రాభ్యాసము నల్పితీఱ వలసి యుండును అని తమకుఁదామే జవాబు చెప్పుకొన్నారు. ప్రభా కరశాస్త్రి గారి మొదటి వాక్యమును బట్టుకొన్న జూడ్య పిశాచము రెండవ వాక్యమును పీడించక విడిచి పెట్టినది. చిరకాల విద్యాభ్యాసనజిగీష జాడ్య మని యనుకోనటవలన నాపిశాచమెక్కడ "వేధించునో యన్న భీతిచే తనుగాఁబోలు నాపిశాచమునుండి. శ్రీనాథుని విడిపించుటకై యీసం దర్భముననే యీదిగువ శ్రీనాథునకు గురువే లేఁడను భావము చదువరు లకు జనింపఁ జేయుటకై, " ఆలోకసోమాన్య ప్రతిభాశాలి యగుటచే నాతఁ డోక వేళనా యఖండ పొండిత్యమును గూడ నాచార్య సన్నిధి వలసి యుండును."