పుట:Srinadhakavi-Jeevithamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

శ్రీనాథకవి



'అల్లాడ భూపతి పుత్రులుక్రీ శ. 1444 వఱకు నవక్రవరాక్రమంబున శత్రు రాజుల సదిమిపట్టి యవసకర్ణాట కటక భూధవులతోడఁజెలిమి వాటించి రాజమహేంధ్రపుర రాజ్యమును బరిపాలించిరని తెలిపి యున్నాఁడను. వీరి రాజ్యము గజపతి రాష్ట్రమునకుఁ బక్కలో బల్లెమై యుండెను. ఈ రెడ్డి రాజ్యము ప్రవర్ధమానమై యున్నంతవఱకు గజపతు లభివృద్ధి గాన రాక యుండిరి, వీరికిఁ గర్ణాటకులు శత్రువులుగ నుండిరి. కర్ణాటకులును రెడ్లు నప్పటప్పట మైత్రిగలిగి యుండుచు వచ్చిరి అదియుఁగూడ నొక విరోధ కారణమై యుండెను పశ్చిముమున బహమనీ రాజ్యము వర్ధిల్లుచుండెను. అహమ్మదు షాహ మరణముఁ జెందఁగా అల్లా ఉద్దీ షాహా 1435 సంవత్సరమున రాజ్యారూఢుడై కర్ణాటక సామాజ్య చక్రవర్తి యగు పౌఢ దేవరాయనితోయుద్ధములు ప్రారంభించెను. ప్రౌఢ దేశరాయలు తురక ప్రభువైనబహమనీ సుల్తాను మాత్రమేగాక హిందువైన గజపతి గూడ శత్రువుగ సుంచుట చేత నొకపక్కగజపతులతోడను, మఱియొకప్రక్క తురకలతోడనుయుధ్ధములుచేయవలసివచ్చెను. యవన . కర్ణాటకభూధవులు సనూనబలులు సమర్థులుగావున దక్షిణ హిందూ దేశమునదమతమ సామ్రాజ్యములను సుస్థిరముగా నిలుపుటకై , 'ఘోరముగా ,బోరాడుచు వచ్చిరి ఇట్టి యుధ్ధతుల నడుమ రెడ్డి రాజ్య మెంతో కాలము నిలువఁ జాలక పోయినది. గజపతులు రెడ్డి రాజ్యమును మ్రింగివేయవలయునని చలముపట్టి యుండిరి. అందులకుఁ గాలము కర్మము సమకూడినది. ఇట్లుండఁగా 1435 వ సంవత్సరమున గజపతుల రాజధానియైన గటక పురమున విప్లవము తటస్థించి రాజైన భాను దేవుడు సంహరింప బడెను. ఈతనితోఁ గళింగ గాంగవంశమంతరించినది. మంత్రియగు' కపిలేంద్ర గజపతి . రాజ్యారూఢుండయ్యెను. ఇతఁడు