పుట:Srinadhakavi-Jeevithamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

శ్రీనాథకవి


రాయని నాశ్రయించి యాతని కంకితముగా వల్ల భాభ్యుదయమును జేయుటవలన నాతనిమూలమున లభించిన దని చెప్పుదురు.” అనియు, శ్రీ ,వీరేశలింగముగారు వ్రాయుచున్నారు. దీనింబట్టి శ్రీనాథుఁడు కర్ణాట రాజధానికిఁ బోయినది దేవరాయని కాలముననా? ప్రౌఢ దేవరాయని కాలము: ననా? దేవరాయలు 1406 , మొదలుకొని 1422... వఱకును, .. 1422 మొదలు1423 వరకును వానికొడుకు విజయబుక్కరాయ లును, 1423 "మొదలుకొని 1447 వఱకును వానికొడుకు ప్రౌడ దేవ రాయలును కర్ణాటక సామాజ్యమును బరిపాలించి యుండుట చేత 1420 లో దేవరాయలే పరిపాలనము చేయుచుండుట స్పష్టము. శ్రీ వీరేశలింగముగారి వాక్యముల నే విశ్వసించిన యెడల నిదివఱకు వారు వ్రాసినదంతయు వ్యర్థమగుచున్నది. అవియేమి కర్మ మోగాని యొక విషయమును గూర్చియే రెండేసియభి ప్రాయము లిచ్చుచుం డుటచేత , విమర్శకుల కనావశ్యకమయిన శ్రమము కలుగుచుండును. 1423 వ సంవత్సరము తరువాతనే శ్రీనాథుఁడు కర్ణాటక రాజధానికిఁ బోయి డిండి మభట్టారకుని జయిం చెనని ఫుటలకుఁ బుటలనింపియు నొక్కమారుగా నాకాశమునండి క్రిందికి జూి నట్లుగా 1420 వ సంవత్సరములో దేవరాయని కాలముననే శ్రీనాధుఁగు కర్ణాట రాజధానికిఁ బోయి వల్ల భాభ్యుదయమును రచించెనని చెప్పుటహాస్యాస్పదముగలేదా? పోనిండు ; ఇంకొక చిత్రమును జూడుడు. ఇంతకును, శ్రీవీరేశలింగముగారు వల్ల ఖాభ్యుదయమును తాము చూడలేదని వాయుచున్నారు. శ్రీ మాన వల్లి రామకృష్ణ కవిగారు క్రీడాభిరామపీఠికలో శ్రీనాథుని వల్ల భాభ్యుద యములోఁ గృష్ణాతీరముననుండు శ్రీకాకుళస్వామి తిరునాళ్లలో జరుగు నసభ్యములు దీనికంటెఁ బచ్చిగా నున్నవి. ............మరియు వల్లభా భ్యుదయమున నాంధ్ర వల్లభుని తిరునాళ్ళలోని విధ వాదుర్వర్తనములు శ్రీ నాముథుడు కు శు విశదము గా వర్ణించి యున్నాడు........... .. శ్రీనాథుడు శ్రీ