పుట:Srinadhakavi-Jeevithamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాద్యాయము

179


లీతనిదమ శత్రుపక్షమువాఁడని యనుమానములో మొదట నలక్ష్య భానముతో నుండిరని తలంపవలసి వచ్చుచున్న ది. శ్రీనాథుఁడు తనకు గల లోకగ్నతకు, నిర్మతను, ప్రశాంతతను, పాండితీ దర్పమును చాటించి భీమేశ్వార పురాణమునఁ గుకవిని రావలమున సంతమృదువుగా మందలించినను, కార్పణ్యము వహించిన పండిత ప్రకాండులతో శ్రీనా ధునికిఁ బ్రచండ వాదముల సల్పుటమాత్రము తప్ప లేదని రాజమహేం ద్రపున పంతుల సీతఁడు తిరస్కరించుచు నుల్లసమాడిన విధమును దెలి పెడు శ్రీనాథుని చాటువులె వేనోళ్ల ఘోషించుచున్నవి. నాటి ప్రధ్వం సౌభావ ప్రాగభావములపై గల్పించిన కల్పనకుఁ దొర్కికులు తలలు వంప వలసియుండును. ఆచాటున నాధోరణులిచట సుదాహరింపఁ దగినవీ కావు అన్నా మాత్యుడు సాహసించి యీతనిఁ జేరఁదీసి భీమే శ్వరపురాణమును రచియింపఁ జేసి తాసంకితము పొందివను బండితుల చాడీకోరుతనమునకు వెఱచి యేమియుఁ జేయక సమయమునకై నిరీక్షించుచు మిన్నకుండెఁ గావలయును. ఎట్టి దైనను ప్రథమసమావేశ కాల మీతని కనుకూలముగా లేదని తోచుచున్నది.

 గీ.వికటముననుండి శ్రు తిపుట నిష్ణురముగ
నడర కాకులు బిట్టు పెద్ఱఱ చినప్పు
డుడిగి రాయంచ యూరక యుంట లెస్స
సైఁపరాకున్న నెందేనిఁ జనుటయొప్పు

అని భీమేశ్వరపురాణమునఁ దాను జెప్పినన్యాయమును నీతిని బాటీంచి కొంత కాలమాపురమున వీడిచి యుండుటకు నిశ్చయించి మహో న్న తదశయందుండిన కర్ణాట రాజ్యమునకుఁబోయి యాసామ్రాజ్య సార్వ భౌముఁ డగు ప్రౌఢ దేవరాయల సందర్శించి సత్కారములఁబొంద సంక ల్పించుకొని విద్యానగరమునకు బయలు నెడ లిపోయెను. శ్రీనాధుఁడు వైదుష్యడర్పములుగల యుద్దండపండితుఁడని యాధ్ర దేశమున నెఱుఁ గుదురు కాని కర్ణాటము లోని పండితు లెఱుంగరు. అచటిపండితుల దుర్మం