పుట:Srinadhakavi-Jeevithamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాని బిరుదములనన్నిటిని నరుణగిరినాథుని కిప్పించి మణిరంజతమయిన సువర్ణాసనమున సభిషిక్తునిగావించి "విద్యా డిండిమశోణ శైలకవి' యని యతని సగ్గించెనఁట. తరువాతమణి కొన్ని విద్వత్త్వకవిత్వ పరీక్షలు పెక్కులు జరిగిననఁట. అప్పుడాయరుణగిరినాథుఁడు 'కవిసార్వభౌమ' బియదమును గాంచి రామపదాంకిత మగుకావ్యమును, డిమమను రూపక మును రచించి బహుప్రఖ్యాతిని గాంచిమించెచెనట. అతఁడు ఢిల్లీ సురత్రా ణునీ వశ్యునిగాఁజేసికొని యతనిచే నాజ్ఞా పత్రమును బొంది మరలవిద్యా నగరమునకు వచ్చి రాయల వారికి జూపించి తాను తొలుతకోరిన ప్రము డావనమునే యగ్రహారముగఁ దానము బడ సెనఁట, ఇయ్యది వాని వంశ్యులచే వ్రాయఁబడిన విభాగరత్నమాలనుండి వ్రాయబడిన కథా సారము, కాని యీకథనంతయు మనము విశ్వసింపరాదు. అరుణగిరి నాధుఁడుద్దండపండితుడై డిండిమభట్టారకుఁ డను నామముతోఁ గవిసార్వ భౌముఁడై ప్రౌఢ దేవరాయని యాస్థానమున నున్న మాట వాస్తవము.

శ్రీనాథుని విద్యానగర ప్రయాణము.

శ్రీనాథుఁడు భీమఖండరచనము తరువాత రాజమహేంద్రపురమున నుండ నిష్టము లేక విద్యానగరమునకుఁ బోవఁగారణ మేమని చదు వరులకు సంశయము జనింపక మానదు. అందునకుఁ గారణము మహేంద్రపుర పండితు తోడి వివాదము లనియె మఱియొకమాఱు చెప్పవలసి వచ్చుచున్నది. శ్రీనాథుఁడు సకలవిద్యాసనాథుఁడయ్యు నెంత వైదుష్యదర్పము గలవాఁ డయ్యు, ప్రశాంతమనస్కుడై వినయ సంపత్తి నధికముగాఁ జూపుచు 'సుకవిజనవిధేయుఁడ' నని తాను తెలుపు కొనుచున్నను పండి తకవులు మత్సర గ్రస్థు లగుచు వివాదములు గల్పించి వేధింపసాగిరి. తనభీమఖండమున వేరు వీరభద్రా రెడ్ల నాకర్షించుటకై కృతిపతివంశవర్ణనా సందర్భమునఁ గృతిపతికిఁ బ్రభువులగు వారి వంశమును గూడఁ జేసినను వారలచిత్తముల “నాకర్షింపఁ జూలకపోయెను.