పుట:Srinadhakavi-Jeevithamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

169


హరవిలాసము వ్రాసి అప్పయ పెట్టి కంకితము చేసినది వాస్తవముగాన శ్రీనాధుఁము -ప్రౌడ దేవరాయని యాస్థానమునకుఁ బోయినది గోమటి వేమభూపాలుని కాలమునఁగాదని చెప్పవలసియుండును. హర విలాసము లక్ష్మణ రావు గారు చెప్పినట్లు కుమారగిరి రెడ్డి కాలమునఁగాని, మరికొందరు చెప్పినట్లు కాళీఖండ రచనానంతరమున గాని రచింపఁబడి యుండుట వాస్త వమయ్యె నేని శ్రీ నాథునకు పెదకోమటి వేమభూ పొలుని కాలముననే చూడఁ బోయేనని చెప్పఁగును. ఏదియెట్లున్నను పై పద్యము నే సందర్భముసవో శ్రీనాథుడే చెప్పి యుండవలయు 'సని నిర్దా రింపచ్చును. కాని శ్రీనాథకవి ); ప్రౌడదేవ రాయల యాస్థానమునకుఁ బోయినది భీమేశ్వరపురాణ వచనమునకుఁ తరువాత, కాశీఖండవచన మునకుఁ బూర్వమునై యుండుట వాస్తవముగా గన్పట్టుచున్నది, ఎందుకన నీసంగతి భీమేశ్వరపురాణమున నెత్తకపోవుటయే గాక తనకు గవిసార్వభౌమ బిరుద మున్నట్లే చెప్పుకొని యుండ లేదు. కాశీఖండ మందన్ననో


శా, కర్ణాటక్షితి నాధచూ క్తిక సభాగారాంత సంక ల్పిత
స్వర్ణ స్నాన జగత్ప్రసిద్ధ కవిరాట్నంస్తుత్యచారిత్ర! దు
గ్దార్ణో రాశీగ బీర ప్రొహ్న ముఖము ధ్యాహ్నా పరాహోర్చతా
పర్ణావల్లభ! రాజు శేఖరమణీ! పట్వాయ గ్రామణీ !


కృతిపతి సంబోథ నపద్యమున సూచింపఁబడి యుండెను. మఱియు నవతారిక లో నల్లాడ వేమభూ పాలుఁడు తన్ను గూర్చి పలికిన యీకింది.---


శా, ఈక్షోణిన్ని సుబోలు సత్కావులు లేరీ "నేటి కాలంబునన్
దాక్షారానుచళుక్య భీమవరగంధి ర్వాప్సరో భామినీ
వక్షద్వయగంధ సోరఘుశృణద్వై రాజ్య భోగంబున
ధ్యక్ష్మించుకు గవిసార్వభౌమ భవదీయ ప్రౌడ సాహిత్యముల్ .

అను పద్యములోఁ దన్నుఁ 'గవిసార్వభౌమ' అని సంబోధించినట్లుగాఁ జెప్పియున్నాఁడు. అట్టి దేమియును భీమేశ్వరపురాణ ముసఁ జెప్పియుండ లేదు గనకనీనడిమి కాలముననే యీతఁడు . పౌఢ దేవ రాయని