పుట:Srinadhakavi-Jeevithamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

శ్రీనాధ కవి


యస్థానమునకుఁ బోయి గౌడడిండ మభట్టునునోడించి యుండవలయు సనియే నాముఖ్యాభిప్రాయము. కొండవీటి పురవర్ణనము గూర్చిన పద్య మును దేననాయని యాస్థానమునం జదివే నను విశ్వాసబుద్ధిలో డట్లు వాసియున్నాడను. ఇప్పుడు చూడ నాయీకడపటి యభిప్రొ యమే సత్యమని తోఁచుచున్న ది. భీమేశ్వరపురాణమునకు ముందే యీకథ నడిచియున్న యెడల శ్రీ నాధుఁడు తప్పక యా గ్రంథమున సూచించియే యుండును.


అష్ట భాషాకవితా సామ్రాజ్యాభిషిక్తుఁడును', డిండిమ . కవిసార్వ భౌమ బికుదాంకితుఁడును, శ్రీకంఠాగమశిఖండమఃడనమణియై ప్రప్రథ మమున విజయుడిండి మము నార్జించిన డిండిమ ప్రభుని దౌహిత్రుఁడును, సభాపతి భట్టారకాచార్య భాగి నేయుండును, సరస్వతీ సౌదలబ్ధ కవితా సనాథుడును, యోగానంద ప్రహసనకర్తయు నగు నరుణగిరినాధుడను మహావిద్వాంసుఁడొకఁడు దేవరాయ మహా రాయల వారి యా యాస్థానమలం కరించి యెట్టిపండితులను, ఎట్టికవులను సరకుగొనక విజృంభించి మనేక పండితుల నోడించెను. కారణమేమో తెలియదు గాని యట్టిపండితాగ్ర గణ్యునకును మన శ్రీనాథభట్ట సుకవికి నుద్భటమైన వివాదము పొసంగినది.

డిండిముని జయించుట.

డిండిమకవిసార్వభౌమ బిరుదాంక ముగల కవి శ్రేష్ఠులు మూవురు గనంబడుచున్నారు. వీరిలో మన శ్రీనాథునకుఁ బ్రత్యర్థిగనున్న యోగా నందప్రహసనకర్త యగు నరుణగిరినాథుఁడను కవియని పైని జెప్పియున్నాఁడను. ఇతఁడు గౌడ బ్రాహ్మణుడు. ఈ మహాకవి తన ప్రహ సనమునందలి భరత వాక్యములో దీర్ఘాయుర్దేక రాయో దధతువసుమతీ చక్రమాచంద్రతారామ్' అని చెప్పియున్నందున నితఁడు ప్రౌఢదేవరా యల కాలములోనేగాక యతని తాతయగు దేవరాయల కాలములో, గూడ నుండెనని విస్పష్టముగాఁ దెలియుచున్నది.