పుట:Srinadhakavi-Jeevithamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి

. నైషధము తరువాత హరవిలాసము రచింపబడినది వాస్తవ మనియు హరవిలాస రచనకాలము 1421 ప్రాంతమనియు చేయుట సాధ్యమైనది. కుమాకగిరెడ్డి కాలముననే రచింపఁబడియుండినయెడల గలిగెఫి యాక్షేపణములను గూర్చి పూర్వ ప్రకరణముస విశేషముగా జర్చించి యున్నాను. హరవిలాసమును గూర్చి తన యేగ్రంథము నందుఁ బ్రసించి యుండకపోవుటచేత వార్ధక్యమున రచించియుండునని యనేకులభి ప్రాయపడుచున్నారు. ఇందలి యవతారికలోని పద్యముల నుబట్టి ద్వితీయ హరిహర రాయలు, కుమారగిరి, ఫిరోజిషాహమూవురు రాజులు బ్రదికియున్న కాలముననే హరవిలాసము రచింపబడి యుండవలయునని శ్రీలక్ష్ముణ రావుగారు ప్రయత్నించినారు. ఈవాదమునందు కొంత బలము గలదుగాని యావాదము నంగీకరించుటకితర విషయము లనేకములు బాధించుచున్నవి. వానిని జాలవలకు జర్చించియే యున్నాను. ఈ గ్రంథము నైషధమునకు భీమేశ్వర పురాణమునకు నడిమికాలమున ననఁగాఁ బెదకోమటి వేమభూపాలుని యనంతరము రచింప బడినదనట సత్యము. ఈ హరవిలాసమును ప్రథమమున ముద్రింపించిన శ్రీ పోలవరము జమీందారుగారగు కోచ్చర్ల తోట రామ చంద్ర వేంకటకృష్ణ రావు బహదరుగారు హరవిలాస ముద్రణ పీఠికలో నిట్లు వ్రాసియున్నారు.

“ ఈ గ్రంథము సయితము సామావశిష్టము గాక యొక్క ప్రతి మాత్రము: పీఠిక లేక తప్పులు కుప్పలుగా తంజావూరు పుస్తక భాండాగారములో నుండిన దాని వ్రాయించి తెప్పించి చిర కాలము ప్రత్యంతరము కోసము ప్రతీక్షించియు లభింప నేరకయ యస్మదాస్థానవిద్వత్కవు లును, శతావధానులునగు తిరుపతి వేంకటేశ్వరుల సహాయంబునం బరి ష్కరించి మాసరస్వతీ పత్రికాముఖమునఁ బ్రచురించుచుండఁగా నైదాశ్వాసము లచ్చుపడువఱకు 'దై పకృపవలనఁ బీఠిక తో నైదాశ్వాసములు :