పుట:Srinadhakavi-Jeevithamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయము 5

హరవిలాసరచనము,

అంతట కొండవీడు రాజ్యము పరహస్తగతమై పోవుటను దలపోసి శ్రీనాథుఁడు: ---

చ. అలగుల వెన్ని యేటికిని, వంత మైన శాల యామిపై
గలుగుల పెన్ని పామునకుఁ గానల వెంబడి సంచరించునా
పులంగున కెన్ని వృక్షములు, పొల్పు వహించిన భూదరాళిలో
నెలఁగును కెన్ని రోమములు నేలికలందఱు కొండవీటికిన్.,


అను చాటువును జెప్పి మిక్కిలి చింతించెనని చెప్పుదురు.

ఇతఁ డావెను వెంటనే అనఁగా క్రీ. శ. 1421 ప్రాంతముల తన పూర్వ స్నేహితుఁడైన కోటీశ్వరుఁడు తిప్పయ పెట్టి తన్నాదరించునను విశ్వాసముతోఁ గాంచీనగరమునకుఁ దన శిష్యుఁడును మఱదియునగు దుగ్గనతోడఁ బోయి యాతని సందర్శించెను. అతఁడును
నత్యాదరము జూపి కొంతకాల మాతని నచట నిలిపి యొకనాఁడతనితో నిట్లనియెను.

<poem>సీ. కనులనాభుని పౌత్రు గవితామహారాజ్య
భిద్రావనారూఢుఁ బరమఫుణ్యు
బాత్రునాపస్తంబు సూత్రు భారద్వాజ
గోత్రు సజ్జ : మిత్రు గుల పవిత్రు
భీమాంబి కామార నామాత్యనందను
సథలపురాణ విద్యా ప్రవీణు
సధ్వర్యు వేదశాఖతిధి నిష్ణాతు
నంద్రభాషా నైషద , భవుని

గీ. సుభయ భాషాకవిత్వ ప్రయోగ కుళలు
బాలసఖుగారిపించి తాత్పర్యమొప్ప
సవచి దేవయత్రి పురారి యక్ష రాజు
హితమితోక్తులు వెలయంగ నిట్టులనియె

1