పుట:Srinadhakavi-Jeevithamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

125


దయా గౌరన నిత్య నర్థి తాన్వయ' యని సింగనామాత్యుని సంబోధిం చిన శ్రీనాధుని సంబోధన పద్యపాదమువలన గ్రహిపనగును. పినపా డునందున్న యుద్భటారాధ్యుని సంతతి వారగువారు తామిళంకరగురు సంతతి వారమని చెప్పుకొనియెదరు. వేమభూపాలునీవలన శా. శ. 1327 అగు పార్థివ సంవత్సర మాఘ మహాశివరాత్రి పుణ్య కాలమున శ్రీశైల మునకుఁ బోయినపుడచట పీనపాడను గ్రామ మీశంకర దేశికునకు దానము చేయఁబడినది.

(5) పిసిపాటి రామభద్రసోమయా----- ఇతఁడు షట్కర్మలనిరతుఁడు. యజుర్వేద వేత్త ఆపస్తంబ సూతుడు భారద్వాజసగోత్రుడు బహుతపస్సంపన్నుడు; బ్రహ్మవేత్త శా. శ. 13301 అగు సర్వధారినామసంవత్స రాశ్వీయుజ బహుళానవాస్యా సూర్యగ్రహణ పుణ్య కాల మున క్రీ. శ. 1408 వేమభూపాలుడీయనకు సహిరణ్యాదక దానధారాపూర్వకముగా పొట్ల పొడు అనుగ్రామము నగ్రహారమునుగా జేసియొసంగెను.

(6) విశ్వేశ్వరపండితుఁడు:--- ఇతఁడు చమత్కారచంద్రికయనుశాస్త్రమును రచించిన వాఁడుగఁ గన్పట్టుచున్నాడు. ఇతఁడుయశోనిధి, మహా మేధోవి విద్యానిహార భూమి, యగు మాథవార్యుని పౌత్రుడు. వేదాదినిద్యలకు జన్మమందిరమువంటివాఁడగు గుండయా ర్యుఁ డీతని తాత! లక్ష్మీనరసింహ మంత్రసిద్ధుఁడును, శాపాను గ్రహదీక్షుడును సకలకవిసార్వభౌముఁడును నగుమాధవార్యుని కుమారుఁడు; మహా విద్వాంసుఁడు, విద్యావిసయాన్వితుఁడు. 'వెలనాటిలో తుంగభద్రాతీరమునందున్న ఆలపాడనుగ్రామము నీతని కగ్రహారముగా నోసంగఁబ *నదీ. వి శ్వేశ్వర భట్టారకుఁడు వెను వెంటనే యరువది పాళ్లుగా విభజించితనవంతు భాగముగాక తక్కిన భాగములను విశిష్ట బాహ్మణులకుఁ బంచియిచ్చెను.

"17) రామ చంద్రజ్యోతీషికుఁడు - ఇతఁడు పెద్దియజ్వ పుత్రుడు నలంకారశా