పుట:Srinadhakavi-Jeevithamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

శ్రీ నాధ కవి


బుత్రుడు; సాష్టాంగమయిన యాయుర్వేద మధ్యయనము చేసినవాడు, ఫణి రాజమహాభాష్యఫ్క పరమేష్టి; పూర్వోత్తరమీమాంసాశాస్త్ర ములు బాగుగా నెఱింగిన నాఁడు; కణాదగీతముల తర్క శాస్త్రముల నేర్చినవాడు యజుర్వేది; ఆపస్తంబ సూత్రుడు; 'కాశ్యపగోత్రుఁడు శివభక్తుడు. ఈశాసనకాలము శా. శ. 1330 అనఁగా క్రీ. శ 1408 దవ సంవత్సము, దత్తాగ్రహారము పొన్నుపల్లి. ఇయ్యది దివిసీమలో కృష్ణాతీరమున నున్నది. ఇందలి పెరియపిళ్ళ, విళ్లయార్య నామములను యీ దానప్రతిగ్రహీతయగు సింగనార్యుఁడు ద్రావిడ బ్రాహ్మణుఁ డగునేమోయని సంశయము కలుగుచున్నది.

(3) "సిద్దియజ్వ: ఇతఁడు యజు ర్వేది. హరితసగోత్రుఁడు; కృష్ణా తీరమున సనేక యజ్ఞములను జేసిన మహావిద్వాంసుఁడగు భీమయజ్వ యూయనముత్తాత (తాతతండ్రి షట క్కకర్క శాలాపప్రక్రియాపర మే శ్వరుడనఁ బ్రసిద్ధిగాంచిన మహా విద్వాంసుఁడు. పోతయ యీయన తాత పౌండరీక యాగము జేసి బ్రహ్మసంతతికి నలంకారమయిన వాఁడు. గుండయ యీయనతండ్రి; గోదావరీతటమునం బెక్కు యజ్ఞములను గావించిన వాఁడును బ్రహ్మ, సూర్యాది సిద్ధాంతములను శోధించి తఱచి చూచిన దైవజ్ఞుఁడును త్రికాల వేత్తయునై నవాఁడు పెద్దియజ్వ: ఇతఁడన వేమభూపాలునివలనఁ గూడ నగ్రహారమును బడసినవాఁడు. ఖండ వాటనున్న కల్యవాములయను గ్రామమును నగ్రహారమును బడసిన నాఁడు. ' ఈశాసన కాలము శా.శ. 1326 వ సంవత్సర మనఁగా క్రీ.శ. సంవత్సరము. ఇతఁడె శా. శ. 1333 అనఁగా క్రీ. శ. 1411 వసంవశ్సరమున వేమభూ పాలునివలన ఖండ వాటి సీమలోని సందమూరు గ్రామమును దానము నొందెను.

(4) శంకరగురువు; ఇతఁడు. వేమభూపాలునీ మాంత్రి శేఖరుఁడు సింగనామాత్యునగు గురువని శృంగార నై షథములో శ్రీ గురు శంకరమానీ