పుట:Srinadhakavi-Jeevithamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

121


(C) భాస్క రామ్యుఁడు; — ఇతఁడు కప్పయెముక గ్రుచ్చుకోనుటచే వ్యధ : జెంచుచున్న పాముబ్రదికించి 'ఇరహితబిరుదమును” బొందిన పండితవంశమున జనించిన పరహితుని కుమారుడు.

<poem>మండూక సయవ్యదత సర్ప ప్రాణాభిరక్షణాత్ ఆసేమషాం పండితానాం కుఱే పరహితాసేవామ్

మొదటి పొన్ను పల్లి శాసనము.


“భూలోకధన్వంతరి యనుప్రసిద్ధిగలవాఁడు; యజుశాఖాధ్యాయి, ఆపస్తంబ సూత్రుఁడు; కాశ్యపగోత్రుఁడు; ప్రభాకరశాస్త్రిగారు భారద్వాజ గోత్రుఁ డని వ్రాయుట, కాశ్య పాయ యజుశ్శాఖాధ్యాయినే సుకృతాత్మనే' యని శాసనములో వ్రాయఁబడిన దానికి విరుద్ధముగాఁ గన్పట్టుచున్నది. అనితల్లి కలువచేఱు శాసనముసగూడ నీశాసనమునం దున్నట్లే పరహితవంశప్రశంస గలదు. అక్కడఁగూడఁ బరహితవంశ్యుఁడే ప్రతిగ్రహీత" అని ప్రభాకరశాస్త్రిగారు వ్రాయుట చూడఁగా వీరిరువురుని నొక్క వంశమువారిగా భావించినట్టు గన్పట్టు చున్నది. ఈ రెండువఁశములు భిన్న వంశమ లని శాసనమ.యుదున్నది. కలువచేటు శాసనములోని పరహీ తాచార్యుఁడు "అత్రిగోత్రకమలాకరభాను" అని 6 తేయగోతుఁడని శాసనములో వక్కాణింపఁబడియెను. కాని దానినిఁఆంధ్ర సాహిత్య పరిషత్పతికలోఁ బ్రకటించిన శ్రీ జయంతి రామయ్య గారు శాసనములోఁ జెప్పఁబడిన దానికిభిన్నముగా భారద్వాజస గోత్రుడని వ్రాయుట వింతగా నున్నది. పరహితవంశ్యులకును, కాశ్యపగోత్రుఁడు నైన భాస్కరార్యుని శ్రీ ప్రభాకరశాస్త్రి గారును,పరహితనం శ్యుఁడు.కు, ఆత్రేయగోత్రుఁమును నగు పరహితాచార్యుని శ్రీజయంతి రామయ్య గారును భారద్వాజసగోత్రులని వ్రాయుటకుఁ గారణమేమో యూహింపనలవిగాదు. వీరుపండితులు పరిశోధకులు నై యుండియు భిన్న గోతులని శాసనములలో స్పష్టముగా వ్రాయఁబడి యుండగా నాశాసనములం బ్రకటించిన వారయ్యు నిట్లు వ్రాయుట