పుట:Srinadhakavi-Jeevithamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

శ్రీనాథకవి


పెదకోమటి వేమారెడ్డి, వామునభట్టును, తిప్పయ సెట్టిని నొక్క యుయ్యెలలో నేయుంచి యొక జోల పాట పాడి జోకొట్టిన వాడని తేలు చున్నది పర్యవసానము.

ఈతని సశస్తి యెట్టిదో యీ క్రింది. ఇందుశ్లోకములవలన బాగుగాఁ దెలియనగును.

 శ్లో, సౌభాగ్యస్య వెళ్తు విధిశ్శృతవసర్వి వ్యా వధూ నాం వగో
ఇక్ష్వాకకేళిగృహు ప్రసూతి భవనం శీలస్యకీర్తేపదమ్
నిస్సామాన్యవికామయాకవితాయ జాగర్తి వత్సాద్వయా
శ్రీమాకన్ సమసభట్టబాణసుకవి స్చాహిత్య చూడామణిః
శ్లో.గాధాస్తాసమాద్యం తారోదధతు వితధతాం తార్కికాస్తర్కవిద్భ
స్సత్రాపత్రాధాగతారోదద్తాం ఫణిఫణితజాషో నః కృతంప్రక్రియాభీః
భూమ్నాం సాహిత్యవీమ్నామది భంవిధువనే నామనే భట్టబాణే
దీప్యత్యస్మిన్ కవీంద్రే జహితజహితభో దద్వరావిద్వాదాస్థాం

భట్ట బాణుని వెనుక నైపుణ్యతను జూపఁగలిగిన గద్యకావ్యకర్తలులేరను లోపమును దీర్చిన వామనభట్ట బాణుని గద్యకవిసార్వభౌముఁడని వచింపనగు.

ఇతర విద్వాంసుల పోషణము

.

ఆర్యవిద్యల సంరక్షణార్థమును, విద్యత్కుటుంబముల పోషణార్థము సకలవిద్యాసనాథుఁడై విద్యాధికారి పదవియం దుండిన శ్రీనాథుడు పెదకోమటి వేమభూపాలునిచే ననే కాగ్రహారముల నిప్పించెను. ఆకాలమున నాంధ్ర దేశమున నాయుర్వేదము విశేషవ్యాప్తి నొందు చున్నటులనేకశాసనములం బట్టి మనము తెలిసికొనఁ గలుగుదుము, అట్టి బహుమానములను గాంచిన యాయుర్వేద విద్యా పారంగుతులయిన మహనీయులు వేమభూపాలుని విద్యాపరిషత్తు , నలంకరించినవారిరువురు గలరు. వారిలో మొదట బహుమానముగాంచినవాఁడు భాస్క రార్యుఁడు. అటుపిమ్మట, బహుమానముఁ గాంచినవాడు సింగనార్యుఁడు