పుట:Srinadhakavi-Jeevithamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

103


మాంబయందు జనించిన తల్లమాంబిక సుద్వాహమై వేమనామాత్యుని ప్రెగడనామాత్యుని, సింగనామాత్యుని గనియెను. ఈ కడపటివాడైన సింగనామాత్యుఁడే త్రిభువనరాయ వేశ్యా భుజంగుఁడనియు. కదనగాం డీవియనియు, జగనొబ్బగండఁడనియు మొదలుగాగల పెక్కు బికుదము లను వహించి వేమక్షితీ పాల రాజ్య విభవకళారణా మణియై విమలతర మైన తన కీర్తి నాల్గు దెసల వ్యాపింపఁ జేసి మిక్కిలి బాసిగాంచినవాఁ డని యీకింది పద్యమువలనఁ దేటపడఁగలదు.

సీ. కనకృపాణము సముద్ధత వైరి శుద్ధాంత తాటంక నుల కెగ్గుదలంచుచు క
దన బాహుసీకంబు ధరణి భృత్కమరాహిసా మజంబులకు విశ్రాంతి, యొసఁగ
దనకీర్తినర్తకి ఘసతరబ్రహ్మాండ భవనము భూముల కొండ్లి పండవిల్ల
దనదానమహిమ సంతాన చింతారత్న జీమూతసురభుల సిగ్గుపలుపఁ

తే. బరయు శ్రీ వేమమండ లేశ్వరుని మంత్రి
యహిత దుర్మంత్రి పదన ముద్రావతార
శాసనుఁడు రాయ వేశ్యాభుజంగ బిరుద
మంత్రి పెద్దయసింగ నామాత్య వరుఁడు.

ఈ పై పద్యముసఁ బేర్కొ నంబడిన వేమమండ లేశ్వరుఁడు క్రీ. శ. 1400 మొదలుకొని 1420 వఱకును కొండవీటి రాజ్యమును బరి పాలించిన పెదకోమటి వేమభూపాలుఁడు గాని కొందఱు తలంచినట్లన వేమభూపాలుఁడు గాడు.

ఈశృంగార నైషధ కావ్యమును శ్రీనాథుఁడు క్రీ. శ.1395 దవ సంవత్సర ప్రాంతమున రచించి యాకాలమున నొక చిన్న సంస్థానమున కధిపతిగానున్న పెదకోమటి వేమునకు మంత్రిగా నుండిన మామిడి సింగ నామాత్యున కఁకితము చేసెనని శ్రీలక్మణ రావుగారి ముఖ్య వాదమై యున్నది. దీనినే వీరేశలింగముగా రనునదించిరి. శ్రీలక్మణ రావుగారు " పెదకోమటి వేమా రెడ్డి 1400 లో కొండవీటి రాజ్యమునకు వచ్చినను అంతకుఁ బూర్వ మేమియు లేని యష్టదరిద్రుడు కాడు. కొండవీటి వంశ ములోనివాఁడు. పెద్ద కుటుంబమువాఁడు. . . . . . ఈతఁడు మాచని వంశ