పుట:Srinadhakavi-Jeevithamu.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
104
శ్రీనాథకవి


ములోని వాఁడు. మాచని తమ్ముడైన వేమ (ఈతనినే ప్రోలయ వేమ యందురు) మిక్కిలి శూరుఁడగుట చే కొండవీటి రాజ్యమాతనికే పోయెను. ఇట్లు కొండవీటి రాజ్యము రెండవవంశమునకుఁబోయినను మాచయ' అతని రెండవకుమారుఁ డైన ' పెదకోమటి' అనామధేయులుగ నుండలే దనియు రాజ్యము చేయుచున్న వారికిఁ దోడుగ నుండిరనియు, మనమూ హింపవచ్చును. *వేమభూపాలీయమునందు వీరిని గొప్ప రాజులుగఁ గవి వర్ణించినాఁడు: ఆయతిశయోక్తిని వదిలినను కొన్ని గ్రామములు భూతాది నిమిత్తమైనను వీరి క్రింద నుండెనని యెంచుట ప్రమాదము కానేకదు. కావున పెన కోమటి' కుమారుఁ డైన వేమారెడ్డి కుమారగిరి మరణానంతరము రాజ్యమునకు వచ్చుటకు బూర్వము ఒక చిన్న జమీం దారుగను రాజవంశమునందు గౌరవముగలవాడుగను ఉండెననుటకు సందేహము లేదు. శ్రీనాథుఁడాకాలమున నాతని మంత్రియైన మామిడి సింగన్నకు నాంధ్రనైషధమును అంకితమిచ్చి వేమరాజునకు మంత్రి యని వర్ణించుటయందు విరుద్ధ మేమియు లేదు. అనఁగా కుమారగిరికొం డవీటిలో ప్రభుత్వము చేయుచున్నప్పుడు అతని పెత్తాత (పెద తాత) మను మఁడగు 'పెదకోమటి వేమా రెడ్డికూడ కొండవీటికీ రాజుగాక పోయినను ఒకచిన్న జమీందారుగ నుండెను. నాలుగూళ్లుగల వారినిగూడ పెద్ద రా జులుగను వారియొద్దనున్న గుమస్తాలను మంత్రులుగను వర్ణించుట మన కవుల, సంప్రదాయమని యాంధ్ర కావ్య పాఠకులకు నేను 'వేఱుఁగ జెప్ప నక్కర లేదు * ' అని యసంబద్ధ వ్యాఖ్యానమును జేసి శ్రీనాథుడు తన్న శృంగార నైషధమును నొక చిన్న జమీందారుఁడైన పెదకోమటి వేము నకు గుమస్థాగానున్న మామిడి సింగన్నకు సంకితము చేసెనని సిద్ధాంత ము చేసినారు. శ్రీలక్ష్మణరావుగారి మాటలవంటి మాటల నుపయోగిం చకపోయినను శ్రీవీ రేశలింగముగారుకూడ వారిపాట నే పాడియున్నారు. పెదకోమటి వేముడస్వతంత్రుడై యున్నకాలమున నీశృం యున్న కాలమున