బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం,
ధర్మా ౽విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ.
బలముగలవారిలో కామరాగములులేని బలమును
నేను. ప్రాణులయందు ధర్మమునకువిరుద్ధము కాని
కామమును నేను. 7-11
యేచైవ సాత్త్వికా భావారాజసా స్తామశాశ్చయే,
మత్త ఏవేతితా న్విద్ధి నత్వహం తేషు తేమయి.
సాత్త్విక, రాజస, తామస గుణములకు సంబంధించిన
భావములెల్ల నానుండియే పుట్టును. వానిని నాయందుంచు
కొందును. నేను వానియందుండను. 7-12
త్రిభిర్గుణ మయైర్భా వైరే భిస్సర్వ మిదం జగత్,
మోహితం నాభిజానాతి మా మేభ్యః పరమవ్యయం.
ఈమూడుగుణములుగా నున్న భావములతో ఈలోక
మంతయు మోహమును బొంది వీనియన్నిటికి నతీతుడనై
నాశరహితుడనైన నన్ను తెలిసికొనలేదు. 7-13
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్య యా,
మా మేవయే ప్రపద్యం తే మాయా మేతాం తరంతి తే.
గుణములచేత నొప్పుచున్న యీ నా దేవమాయను
గడచుట కష్టము. నన్నే యెవరు శరణుచొత్తురో వారేయీ
మాయను గడువగలరు. 7-14