కార్యకారణ కర్తృ త్వే హేతుః ప్రకృతి రుచ్యతే
పురుషస్సుఖదుఃఖానాం భోక్తృ త్వే హేతు రుచ్య తే.
కార్యములకుగల హేతువు ప్రకృతివస్తువందురు. సుఖదుఃఖములు
కలుగుటకు హేతువు పురుషుడందురు. 13-21
పురుషః ప్రకృతిస్థోహి భుంక్తేప్రకృతిజాన్ గుణాన్
కారణం గుణసంగో౽స్య సదసద్యోనిజన్మసు.
పురుషుడు ప్రకృతిలోనుండి ప్రకృతివలన పుట్టిన
గుణముల ననుభవించుచుండును. గుణములలో నితనికుండు
సంగమే ఇతడు మంచివియు, చెడ్డవియునగు జన్మముల నెత్తు
టకు గారణమై యున్నది. 13-22
ద్వా విమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ
క్షరస్సర్వాణి భూతాని కూటస్థో౽క్షర ఉచ్యతే.
లోకములో క్షరము, అక్షరము అను రెండువిధముల
తత్త్వములున్నవి. క్షరమనగా సర్వభూతములు; వానిలో
మారకుండనుండు వస్తువక్షరము. 15-16
ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః
యోలోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.
పురుషుడనువాడు జీవుడు. ఉత్తమపురుషుడువేరు.
అతడే పరమాత్మ యనబడువాడు. అతడు మూడులోకము
లను నావరించి వానిని ధరించుచున్నాడు. అతడవ్యయుడు,
ఈశ్వరుడు. 15-17