యస్మాత్ క్షర మతీతో౽హ మక్షరాదపిచోత్తమః
అతో౽స్మిలోకే వేదేచ ప్రథితః పురుషోత్తమః
నేను క్షరమునకు మించినవాడనై అక్షరముకంటె
నుత్తముడనై యుండుటచేత లోకమునందును వేదమునందును
పురుషో త్తముడని పొగడబడుచున్నాను. 15-18
భూమిరాపో౽ నలో వాయుఃఖం మనోబుద్ధి రేవ చ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా.
భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి,
అహంకారము ఈ యెనిమిది భేదములుగా నాప్రకృతి వేరు
పడియున్నది. 7-4
అప రే౽యమిత స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మేపరామ్
జీవభూతాం మహాబాహో యయేదం ధార్య తేజగత్
ఇది నానికృష్టస్వరూపము. దీనినుండి వేరుపడి యున్న
నాస్వరూపమును దెలిసికొనుము. అదే ప్రాణులకు ప్రాణ
మనునది. దానిచేతనే నీలోకము ధరింప బడుచున్నది. 7-5
ఏత ద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయ స్తథా.
ఎల్లప్రాణులకును నది కారణమని తెలియుము. లోక
మంతయు నావలన పుట్టుటయు, నాయందు లీనమై లేకుండ
బోవుటయు కలుగుచున్నది. 7-6