జీవితలక్ష్యమునుబట్టి నడచుటవలన నందరి జీవనక్రమము నేకభావమునొంది, యందరి సంఘజీవనమునందును, సుఖము నెలకొనును.
సాధారణముగా దేహారోగ్యమునకు, సుఖాధారముగ
చెప్పిన పథ్యములనుగూడ నందరును దోషముకాని లోపము
గాని లేకుండ సంపూర్ణముగ ననుసరింప సాధ్యముకాదు.
కాని, లోపములతో గూడియున్నను, ఆరోగ్య శాస్త్రోపదేశముచేత
నెక్కువ ప్రయోజనముండునని మనము చూచు
చున్నాము. దేహారోగ్యముకంటెను నాత్మసుఖమును సంపాదించుట
కఠనముకదా? దానికై యుపదేశించియున్న పద్ధతులు
కఠినముగనే యుండును. అందరును వానిని లోపములులేక
యనుసరించుట యసాధ్యముగనే యుండును. కాని
యుపదేశము ప్రయోజనకారి కాకపోదు. ఉత్తమలక్ష్యములు,
మనుష్యుని జీవనములు, హితసాధకములై యున్నవి.
సంపూర్ణముగ నొంద సాధ్యముకాదని, ధర్మప్రకాశము నార్పివైచి,
చీకటియం దుండగూడదు. గీతలోనే భగవంతుడు చెప్పి
యున్నాడు.
నేహాభిక్రమనాశో౽స్తి ప్రత్యవాయోన విద్య తే
స్వల్ప మప్యస్య ధర్మస్యత్రాయతే మహతో భయాత్.