ఈ పుట ఆమోదించబడ్డది
వేత్తాసి వేద్యంచ పరంచ ధామ
త్వయా తతం విశ్వ మన న్తరూప.
నీ వాదిదేవుడవు ! ఆదిపురుషుడవు, నీవే సర్వమునకు
పరమ నిలయమవు, తెలియదగిన తత్త్వమవై, పరమపదవివై,
అనంతరూపుడవై లోకమంతటను వ్యాపించియున్నావు. 11-38
వాయు ర్యమో౽గ్ని ర్వరుణ శ్శశాంకః
ప్రజాపతి స్త్వం ప్రపితామహశ్చ,
నమో నమస్తే౽స్తు సహస్రకృత్వః
పునశ్చ భూయో౽పి నమో నమస్తే.
వాయువవు నీవే, యముడవు నీవే, అగ్నివి నీవే,
వరుణడవును, చంద్రుడవును, బ్రహ్మమును నీవే; నీకు వేయు
సారులు నమస్కరించుచున్నాను. మరియుమరియు నీకు
నమస్కరించుచున్నాను. 11-39
నమః పురస్తా దథ పృష్ఠతస్తే
నమో౽స్తుతే సర్వత ఏవ సర్వ,
అనంతవీర్యామితవిక్రమ స్త్వం
సర్వం సమాప్నోషి తతో౽సి సర్వః.
ముందుభాగమున నీకు నమస్కారము, వెనుకభాగమున
నమస్కారము; అంతయు నయినవాడా! నీ కెల్లప్రక్క