ఈ పుట ఆమోదించబడ్డది
లను నమస్కరించుచున్నాను. ఎన్నడును అంతము లేనివీర్యముగలవాడా! అలవి లేనివిక్రమము గలవాడా ! అన్నిటను పూర్ణుడవై యున్నవాడా ! అంతయు నైనవాడవునీవే. 11-40
పితా౽సి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్,
నత్వత్సమో౽స్తభ్యధికః కుతో౽న్యో
లోకత్రయే ప్యప్రతిమ ప్రభావ.
చరాచరలోకమునకు తండ్రివి, పూజ్యుడవు, గొప్ప
గురుడవు, నీకు సముడెవడును లేడనగా, నిక నీకంటెనెక్కువ
వాడెవడుండును? మూడులోకములందును నీప్రభావమునకు
సాటిలేదు. 11-43
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహ మీశ మీడ్యమ్,
పిత్రేవ పుత్త్రస్య సఖేవ సఖ్యుః
ప్రియఃప్రియాయా౽ర్హసి దేవ సోఢుమ్.
శరీరమును సాష్టాంగముగ వైచి నీ యనుగ్రహమును
వేడుచున్నాను. ఈశా! పూజ్యుడా ! కొడుకును తండ్రివలెను,
స్నేహితుని స్నేహితునివలెను; ప్రియురాలిని ప్రియుడువలెను
నన్ను సహింపవలెను, దేవా! 11-44