ఈ పుట ఆమోదించబడ్డది
గొప్పజ్ఞానిని, పురాతనుని, అనుశాసకుని, అణువులో నణువైన పరవస్తువును, ఎల్లవానిని ధరించువానిని, ఎన్నుటకు వీలులేని రూపముగలవానిని, సూర్యుని ప్రకాశముగలిగి, చీకటి నతిక్రమించి నిలుచువానిని, ఎవడు ధ్యానించుచుండునో, 8-9
ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యాయుక్తో యోగబలేన చైవ
భ్రువోర్మధ్యే ప్రాణ మావేశ్య సమ్యక్
స తం పరం పురుష ముపైతి దివ్యం.
అతడు మరణకాలమున జంచలముకాని మనస్సుతో
కనుబొమలమధ్యమున ప్రాణమును నిలుపుకొని, యోగబలముచేతను,
భక్తిచేతను, ఆదివ్యపరమపురుషునిపొందును. 8-10
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ
మూర్థ్న్యాధాయాత్మనఃప్రాణమాస్థితో యోగధారణామ్.
ఎల్లద్వారములను బాగుగమూసి, మనస్సును
హృదయములోనే నిరోధించి, తనప్రాణమును తలపైభాగమున
నిలిపి, యోగస్థానమును ధరించి, 8-12
ఓ మిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్
యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం.