ఈ పుట ఆమోదించబడ్డది
భూతగ్రామ స్సఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే
రాత్య్రాయాగమే౽వశః పార్థ ప్రభవ త్యహరాగమే.
ఆభౌతికప్రపంచము తిరిగి తిరిగి తనవశము లేకయే
రాత్రి యగుటతోడనే యడగిపోవుచున్నది, పగలురాగానే
మరల పుట్టుచున్నది. 8-19
పర స్తస్మా త్తు భావో౽న్యో౽వ్యక్తో౽వ్యక్తా త్సనాతనః
యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు నవినశ్యతి.
అవ్యక్తముకంటె నవ్యక్తముగ, దానికిపైనున్న
మార్పులేని తత్త్వ మొకటి యున్నది. ఎల్లప్రాణులును నశించినను,
అది నశింపదు. 8-20
పురుష స్స పరః పార్థ భక్త్యా లభ్య స్త్వనన్యయా
యస్యాంతస్థాని భూతాని యేన సర్వ మిదం తతమ్
వేరుతత్త్వమున ప్రవర్తింపని భక్తితో నా పరమపురుషుని
పొందవచ్చును. వానిలోనే యెల్లభూతములును నెలకొనియున్నవి.
అతడీ లోకమందంతటను వ్యాపించి నిలిచియున్నాడు. 8-22
కవిం పురాణ మనుశాసితార
మనోరణీయాంస మనుస్మరేద్యః
సర్వస్య ధాతార మచిన్త్యరూప
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్.