గుణములను గడచి బ్రహ్మపదమును పొంద తగినవా డగును. 14-26
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయ న్తః పరస్పరం
కథయ న్త శ్చ మాం నిత్యం తుష్య న్తి చ రమన్తి చ.
చిత్తమును నాయందు నిలిపి, ప్రాణమును నాయందే
చొప్పించి నన్నుగూర్చి యొకరితో నొకరు చెప్పి తెలిసి
కొనుచు నాభక్తులు తృప్తిని శాంతిని పొందుదురు. 10-9
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం
దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాన్తి తే.
ఎప్పుడును మనస్సు వశముచేసుకొని ప్రీతితో నన్ను
చేరువారికి నేను బుద్ధియోగము నిత్తును. దానివలన వారు
నన్ను పొందుదురు. 10-10
తేషా మే వానుకంపార్థ మహ మజ్ఞానజం తమః
నాశయా మ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా.
వారినికరుణించుటకు వారిమనోభావములందు చొచ్చి
ప్రకాశించుజ్ఞానజ్యోతితో వారియజ్ఞాన మను చీకటిని తొలగింతును. 10-11
అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.