వేరుతలపును తలపక నన్నుపాసించు నిత్యయోగుల యోగక్షేమమును నేనే భరింతును. 9-22
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత
త త్ప్రసాదా త్పరంశాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం
ఈశ్వరునే తుదివరకు శరణుచొరుము. అతనిఅనుగ్రహమున
అంతటను సంపూర్ణశాంతియును శాశ్వతస్థానమును
పొందుము. 18-62
సర్వ గుహ్య తమం భూయ శ్శృణు మే పరమం వచః
ఇష్టో౽సిమే దృఢమితి తతో వక్ష్యామి తేహితం.
అన్నిటికంటె ముఖ్యమైనదియు, నన్నిటికంటె రహస్య
మైనదియు నైన నాపరమవచనమును వినుము. నాకు నీవు
ప్రేమపాత్రుడవు కావున నీకు హితమును వృద్ధియు నగునట్లు
చెప్పుచున్నాను. 18-64
మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో౽సిమే.
నీమనస్సును నాయందు విడువుము. నామీద భక్తి
నిలుపుము. నాకనియే హోమములనెల్ల చేయుము. నాకే
నమస్కరింపుము. నన్ను చేరుదువు. ఇది సత్యము. నీకు వృద్ధి
గూర్చెదను. నీవు నాకు ప్రియమైనవాడవు. 18-65