గుణము మనకు వచ్చును. ఇట్లుపాసనచేయువానిగుణమును ఉపాసన క్రమమును నొకటి నొకటి సంబంధింపబడియున్నవి.
ఏవిధమైన శ్రద్ధనుగాని నమ్మికనుగానికలిగి కర్మములు
చేయుదుమో నదియును ఇట్టిదియే. పొందిన గుణమునకు
తగిన శ్రద్ధమనస్సునకు చేరును. చేకొన్న శ్రద్ధకు తగినగుణమువచ్చి
చేరును.
ఆచారములును, ప్రవృత్తివిషయములును ఇట్లే ఇవన్నియు
మనము వడసిన గుణమునకు దగినవరకు నేర్పడును.
గుణమును వానిననుసరించి మారును. పొయ్యిలోని నిప్పునకును
కట్టెలకును గల సంబంధమువంటిది. మొదట నిప్పుకట్టెను
మండించును. కట్టె మండినయెడల నిప్పు మరింత మండును.
పరస్పరము సహాయ మేర్పడును. మంచి గుణములు
పొందినవాడు, మంచి గురువును మంచి దైవమును, మంచి
మనోభావములను, మంచి లక్ష్యములను ఏర్పరచికొనును.
దానిచే గుణ మింకను మేల్మిని పొందును. మంచిగుణములం
దతనికి రుచికలుగును. మంచియాహార మతనికి సంతోషమిచ్చును.
వానిచే వాని మంచిగుణమింకను వృద్ధియగును.
గుణములేనివాని బుద్ధియో, యుపయోగములేని యుపాసన,
యుపయోగములేని తామస ప్రకృతి దురాచారము
మొదలగువానిలో ప్రవర్తించును. రానురాను తామసగుణ మధిక
మగును.