ఈ పుట ఆమోదించబడ్డది
మొదటినుండియు నారంభించుట యనునది సాధ్యము కానిపని యగును.
యశ్శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిం.
శాస్త్రవిధులను బయటికి త్రోసి, కామము ప్రేరించి
నట్లు నడచువానికి సిద్ధి లేదు; సుఖము లేదు, పరగతియు
లేదు. 16-23
తస్మా చ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మకర్తుమిహార్హసి.
కావున, నీవు దేనిని చేయవచ్చును, దేనిని విడువ
వచ్చును, అనువ్యవస్థను తెలుసుకొనుటకు శాస్త్రమునేప్రమాణముగా
నుంచుకొనుము. శాస్త్రవిధానమును దెలిసి, నీవు
కర్మములనుచేసి జీవితమును గడుపువాడవుగమ్ము. 14-24
(23)
గుణ విభాగము
(గీత: అధ్యాయము 17)
మన ప్రకృతిగుణములకు తగినమట్టు కుపాసనకు మూర్తిని
వెదకుకొందుము. మనము దేని నుపాసింతుమో దాని