తిని పొందును. నిశ్చయముగ తెలిసికొనుము. నా భక్తు డెవనికిని నాశములేదు. 9-31
మాంహి పార్థ వ్యపాశ్రిత్యయే౽పిస్యుః పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే౽పియాన్తిపరాంగతిం.
పాపులు నన్ను శరణుజొచ్చినయెడల, స్త్రీలైనను,
వైశ్యులైనను, శూద్రులైనను, పరగతిని పొందుదురు. 9-32
దేవుని భజించువాడేకులమువాడనికాని, మగవాడు
ఆడుది యనికాని యనుట యెట్లు ముఖ్యముకాదో, అట్లే
యెట్లు దేవునారాధించు ననునదియు ముఖ్యముకాదు. ఇది
గీతలో మనము చూచు గొప్పవిషయము. హిందూమతమునకు
గొప్ప కీర్తినితెచ్చువిషయము. భగవంతు ననేకు లనేక
విధముల నారాధింతురు. మతము, సంప్రదాయము,
వీనిభేదములను నేను లెక్కింపనని గీతలో భగవంతుడు స్పష్టముగ
చెప్పియున్నాడు.
యేయథామాంప్రపద్యన్తేతాం స్తథైవభజామ్యహమ్
మమ వర్త్మానువర్తనే మనుష్యాః పార్థ సర్వశః.
ఎవరు నన్నెట్లుభజింతురో వారి నట్లే నే ననుగ్రహింతును.
మనుష్యు లేమార్గము ననుసరించినను నన్ను పొందు
మార్గమేయగును. 4-11