ఇతరశాస్త్రపుస్తకములలో నేమిచెప్పియున్నను. భగవంతుని శరణుజొచ్చి విడుదలనొందుటకు జాతిగాని, కులము గాని బాధింపదు. దీనిలో ఆడు, మగయు, వ్యత్యాసము లేదు. దీనికి గీతలో చెప్పబడియున్న శ్లోకములు:
నమో౽హం సర్వభూతేషు నమే ద్వేష్యో౽స్తినప్రియః
యే భజన్తితుమాం భక్త్యా మయితే తేషు చాప్యహమ్.
నేనెల్లప్రాణులందును సమముగా నుందును. నే నెవ్వరిని
ద్వేషింపను, ప్రేమింపను నన్ను భక్తితో నెవరు
భజింతురో వారు నాయం దమరియుందురు. వారిలో
నేనుందును. 9-29
అపిచేత్సుదురాచారో భజతే మా మనన్యభాక్
సాధురేవ సమన్తవ్య స్సమ్యగ్వ్య వసితోహిసః.
మిక్కిలి చెడునడత గలవాడయినను వేరుదాని
యందు మనస్సును పోనీయక, నన్ను భజించినవానిని
మంచివాడనియే తలపవలెను. అతని ప్రయత్నము మంచి
ప్రయత్నము. 9-30
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి
కౌంతేయ ప్రతిజానీహి ననే భక్తః ప్రణశ్యతి.
అట్టివాడు శీఘ్రముగనే ధర్మాత్ముడగును. నిత్యశాం