పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తరువాత అనపర్తి, పిఠాపురం మొదలైన గ్రామాలను జాగీరుగా యిచ్చాడు. పిఠాపురం పరిపాలించిన పద్మనాయక రాజులె వెలమవారు. వేలమ్మదేవి అనే అమ్మవారి దయకు పాత్రులై పరాక్రమము, ఐశ్వర్యము కలిగి వెలమవారయ్యారు అని అంటారు. వీరి మూలపురుషుడు రేచర్ల బేతాళ నాయకుడు. పిల్లలమర్రికి ప్రభువు. కాకతీయ సార్వభౌముడు గణపతిదేవునకు సహాయపడుతూ ఓరుగల్లు కోటకు బురుజులు కట్టి ఒక్కొక్క బురుజుమీద 77 మంది వెలమవీరులకు ప్రతిష్టాపన చేసి శత్రువులకు దురుభేద్యముగా ఆ కోటను నిర్మించాడు. ఆయన కొడుకు రేచర్ల ప్రసాదిక్య నాయకుడు రుద్రమదేవికి అంగరక్షకుడుగా, సైన్యాధ్యక్షుడుగా, మంత్రిగా వుంటూ కాకతీయ సామ్రాజ్యమును విస్తరింపజేసిన మహావీరుడు. పలనాటి బ్రహ్మనాయుడు బేతాళనాయుడు మనుమడె వీరి వంశమువారే అయిన అనపోతనాయుడుకి రేచడు అనే మాలవాడు తన ప్రాణములను దారపోసి అనేక ధనరాసులు యితనికి అందజేస్తాడు. ఇప్పటికి రేచడికి గౌరసూచకముగా వారు వివాహము చేసికోవటానికి ముందుగా రేచర వంశస్తునకు పెండ్లి చేస్తారు. నా మిత్రుడు స్వర్గీయ రావు విశ్వేశ్వరరావు ఆ వంశమువారికి పెళ్ళి చేసి తరువాతే అతను పెండ్లి చేసికోవటం నాకు తెలుసు.

రాచకొండ పరిపాలకుడు సర్వసింగభూపాలుడు వీరి వంశంవాడే. శ్రీరంగములో పన్నెండుమంది ఆళ్వారులతో పాటు పదమూడవ ఆళ్వారుగా ప్రసిద్ధి పొందిన రావు మాధవరాయణంగారు సర్వసింగభూపాలుని సోదరుడే. కంచిలో వైష్ణవులకు, శైవులకు మధ్య పోరాటం జరిగినప్పుడు మాధవరాయణంగారు వైష్ణవులు పక్షం చేరి యుద్ధము చేశారు. శిరస్సు తెగిన ఆయన మొండెము చాల దూరము ముందుకు నడిచి జంబుకేశ్వరం గుడిదాక వెళ్లి పడిపోయింది. ఆ స్థలమే వైష్ణవులకు, శైవులకు సరిహద్దు అయింది. వీరి వంశం వారే పెద్ద రాజావారు అని పిలవబడేవారు. గంగాధర రామారావుగారు 1890 వరకు పాలించి అఖండకీర్తి సంపాదించారు. ఆయన కుమారుడు శ్రీ రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూరు. 1907 లో పట్టాభిషేకము చేసికొని 1949లో జమీందారీల ప్రభుత్వము రద్దు చేసేవరకు పిఠాపురంను పాలించారు. వీరి రాజ్యకాలములో పిఠాపురం మూడు పువ్వులు ఆరు కాయలగా విలసింది. వీరి పాలనలో సంగీత సాహిత్యాలకు ఆటపట్టుగా విద్యలకు, విజ్ఞానానికి పట్టుకొమ్మగా కళలకు నెలతావుగా, శాస్త్రాలకు పుట్టినిల్లుగా సరస్వతికి కేళిగృహముగా వేదవిద్యలకు ఆలవాలంగా పురాణ ప్రసిద్ధమైన దివ్యతీర్ధంగ చరిత్ర ప్రసిద్ధమైన పట్టణంగా వెలసింది.

రచన: కొత్తేం సుబ్బారావు

గ్రంథాలయ కమిటీ ఉపాధ్యక్షులు