పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిఠాపురం ప్రభ పిఠాపురానిదే

శివుని సతి సతీదేవి పార్థివ శరీరమును శ్రీ మహావిష్ణువు అష్టాదశ ఖండాలుగా ఖండించాడు. అందులో దశమభాగం పీఠభాగము లేక పిష్టభాగము యిచ్చట పడుటవలన ఈ పురమునకు పిష్టపురం, పీఠికాపురం అనే పేర్లు వచ్చాయి.

500 సం||రంల క్రితం శ్రీనాథమహాకవి, 5000 సం||రంలకు పూర్వం వ్యాసమహర్షి యీ పట్టణాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది. ఇదికాక చైనా దేశపు రాయబారి హియాన్‌త్సాంగ్ మన దేశమునకు వచ్చి యిచ్చటి విశేషములు వ్రాయుటలో దక్షిణమున పిష్టపురమను నొక ప్రసిద్ధమైన పట్టణమున్నదని వ్రాసాడట.

పిఠాపురం పూర్వకాలమునుండి అనేక రాజ్యాలకు రాజధానిగా వుండేదని, పిఠాపురం కోట శత్రువులకు చొరరానంత బలిష్ఠంగా వుండేదట. క్రీస్తు పూర్వమె మగధరాజ్యాధిపతులైన నందులు, మౌర్యులు, గుప్తులు పిఠాపురంను ప్రాంతీయ రాజధానిగా చేసికొని పరిపాలించేవారు. శాతవాహనుల కాలములో కూడ పిఠాపురం ఒక మండలానికి రాజధానిగా వుండెడిది. క్రీ.శ. 210 లో ఆంధ్రప్రభువు శ్రీవాశిష్టపుత్రస్వామిసిరి పిఠాపురమును పరిపాలించాడు. దక్షిణ చాణక్యరాజు రెండవ పులకేశి క్రీ.శ. 625 లో పిఠాపురంను జయించి తన రాజప్రతినిధిగా తమ్ముడు విష్ణువర్ధనుని నియమించాడు. ఇతనిని కుబ్జ విష్ణువర్ధనుడని కూడ అంటారు. అతడు స్వతంత్రుడై వేంగి రాజ్యాన్ని పిఠాపురంను రాజధానిగా చేసికొని పాలించాడు. విష్ణువర్ణనుని తరువాత తూర్పు చాళుక్యులు పరిపాలించారు. రెడ్డిరాజులు అనంతరము తూర్పు తీర ప్రాంతమంతా గజపతుల వశం అయ్యింది. శ్రీకృష్ణదేవరాయలు కళింగము వరకు జయించాడు. తరువాత తల్లికోట యుద్ధం అనంతరము 1571 నాటికి ఉత్తర సర్కారులన్నియు గోలుకొండ నవాబుల పాలనలోకి వచ్చింది. గోలుకొండ నవాబులకు సేనానాయకులుగా వున్న వెలమ కులస్తులైన రావు వంశీయులకు పిఠాపురం సంస్థానము సంక్రమించినది.

నవాబును చంపటానికి గుర్రం మీద దౌడు తీస్తు వస్తున్న వజీరును ఒక్క వ్రేటుతో గుర్రంతో సహా ఆరు ముక్కలుగా నరికిన పరాక్రమశాలి తెలుగురాయణంగారు. తెలుగు రాయణంగారి స్వామికార్య పరాతంత్రకు మెచ్చి గోలుకొండ నవాబు రాజమండ్రి సర్కారుకు సర్దారుగా నియమించి

8