పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇటీవల గ్రంథాలయంలోనికి తాళపత్ర గ్రంథములు కావ్యనాటిక, అలంకారాలు, విష్ణు హోమం, పరాయితం ఉదకశాంతి, అష్టమరజితములు, నక్షత్రయిష్ఠ, సేకరించి పురావస్తు శాఖవారి సహకారంతో రసాయన ప్రక్రియ ద్వారా శుభ్రపరచి దుడ్డు కుక్కుటేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతుల కానుకగా యిచ్చిన గాజు పెట్టెలో భద్రపరచడమైనది.

1977లో గ్రంథాలయ వజోత్సవం నిర్వహింపబడినది. ఈ సందర్భముగా కళాప్రపూర్ణ పాతూరి నాగభూషణంగారు యం.ఆర్.అప్పారావుగారు, పిఠాపురం యువరాజా గంగాధర రామారావుగారు, డా|| సి.నారాయణరెడ్డిగారు, ద్విభాష్యం అప్పలాచార్యులుగారు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగార్లకు యీ సభలో సన్మానం చేయుట జరిగినది.

పిఠాపురంనకు కీర్తినిచ్చిన కవులు, సంగీత విద్వాంసులు, కళాకారులు కవులు: సర్వశ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి, పానుగంటి లక్ష్మీనరసింహరావు, మొక్కపాటి నరసింహమూర్తి, వెంకట పార్వతీశ కవులు, బాలాంతరపు రజనీకాంతారావు, పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, దాసరి లక్ష్మణకవి, పన్నాల భట్టుశర్మ, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి, ఉమర్ ఆలీషా, ఆవంత్స సోమసుందర్.

సంగీత విద్వాంసులు: నేదునూరి కృష్ణమూర్తి, తామరాడ సంగమేశ్వరశాస్త్రి, రేగిళ్ళ సుబ్బారావు(ఈలపాట), వీణ చిట్టిబాబు, పిడేలు వేమనదొరగారు, బాదం అప్పారావు గుప్త (హరికధ) మునగాల నీలాద్రిరావు (నాటకరంగం) పెండ్యాల సత్యభామ (భామాకలాపం)

సినీకళాకారులు: రామశర్మ, హరనాధ్. నేపధ్యగాయకులు : పాతర్లగడ్డ నాగేశ్వరరావు అంతర్జాతీయంగా పేరున్న చదరంగం ఆటగాడు స్వర్గీయ గొల్లకోట దీక్షితులుగారు మన పిఠాపురం వాస్తవ్యుడు.

ఇదివరలో గ్రంధాలయ అద్యక్షులు: డా. తనికెళ్ళ సత్యనారాయణగారు , చెలికాని భావనరావుగారు, డా. కాదులూరి వెంకటరావుగారు ప్రస్తుతం బాదం మాధవరావుగారు

ఇదివరలో పనిచేసిన లైబ్రేరియన్లు : అల్లంరాజు రంగనాయకులు, కాకర్ల వీరరాఘవులు, పెండ్యాల శ్రీరామమూర్తి, వేణుం శ్రీనివాసరావు, ప్రస్తుతం మల్యాల శేష శ్రీనివాసరావు.

ప్రస్తుత కార్యవర్గం: అధ్యక్షులు: బాదం మాధవరావు

ఉపాధ్యక్షులు: మునగాల భరతుడు, కొత్తెం సుబ్బారావు

కార్యదర్శి: కొండేపూడి శంకరరావు, సంయుక్త కార్యదర్శి : రాయవరపు సుబ్బారావు, కోశాధికారి: రెడ్డెం శేషారావు, సభ్యులు: శ్రీమతి పి.ఎన్ వసంత, రావుల అయ్యన్న, సయ్యద్ మొహిద్దీన్, పెదపాటి పెదనాయన, కండేపల్లి వెంకటరమణ, బొర్రా నాగభూషణం. గ్రంథాలయం యీనాటి ఉచ్చస్థితికి కారకులైన దాతలందరికి పేరు పేరునా, కార్యవర్గం తరపున కృతజ్ఞతాభివందనములు.

5