పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2012 సం||రంలో గ్రంథాలయం పై అంతస్తు స్వర్గీయ చెలికాని భావనరావు సభాసదనన్ను దాతల విరాళములతో నిర్మించడమైనది. ప్రజోపకార్యక్రమములకు ఉచితంగా యిచ్చుటకు నిర్ణయించడమైనది. లైటింగ్, మైక్, సౌండ్ సిస్టమ్, 170 కుర్చీలు ఏర్పాటు చేయడమైనది. డాక్టర్వే దాంతం ఆనందకుమార్ గారు వారి మాతామహులు స్వర్గీయ ఓలేటి సీతారామశాస్త్రిగారి పేరుపై రూ. 40,000/-లతో నీటి సరఫరా ఏర్పాటు చేసినారు. పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వారి విరాళము ఒక లక్ష రూపాయలతో వారి పేరుమీద కళావేదిక నిర్మించడమైనది. డాక్టర్ వేదాంతం ఆనంద కుమార్ గారు దాతగా గ్రంథాలయం దక్షిణం వైపు గోడ గ్రంథాలయ కమిటీ తీర్మానము ప్రకారం ఎత్తు చేసినారు. వారికి కృతజ్ఞతలు. గ్రంథాలయంలో డాక్టర్ ఆవంత్స సోమసుందర్ సాహితీ భవన్, రూ. 45,000/-లతో నిర్మించడమైనది. దీని నిమిత్తం వారి కుమారుడు విజయశాతకర్ణి రూ.35,000/-లు విరాళము యిచ్చినారు. 1994 సం||లో స్వర్గీయ డాక్టర్ పంతం రంగారావుగారు బయట సభలు జరుపుకొనుటకు వీలుగా స్టేజిని నిర్మాణము చేసినారు.

గ్రంథాలయముకు వస్తు రూపేణా విరాళమిచ్చిన దాతలు : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషాగారు సభాసదనకు లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఇన్వర్టర్ బహూకరించినారు. దాతలు 170 కుర్చీలు, ఫ్యానులు బహూకరించినారు. కలియుగ భీముడు కోడిరామమూర్తిగారు 1917 సం||లో గ్రంథాలయమును సందర్శించి రూ. 100/-లు కానుకగా ఇచ్చినారు. దానితో 4 టేకు బీరువాలు కొనబడినవి. 1940 సం||లో లక్ష్మీనరసాపురం సంస్థానాధిపతులు రామయ్యమ్మగారు 4 టేకు బీరువాలు, విలువైన పుస్తకములు బహూకరించినారు. గోటేటి జోగిరాజు పంతులుగారు, సత్యవోలు సూర్యప్రకాశరావుగారు, వేపూరి వేణుగోపాలదాసుగారు టేకు బీరువాలు గ్రంథాలయముకు బహూకరించినారు. ఇటీవల కండ్రెడ్డి మాధవరావుగారు 12 అరలు గల టేకు బీరువా, గొరకపూడి చిన్నయ్య దొర, సామర్లకోటవారు 4 సిమెంట్ బెంచీలు, స్థానిక పురపాలక కౌన్సిలర్ శ్రీమతి వై.సౌజన్యగారు 6 నీల్ కమల్ కుర్చీలు బహూకరించినారు.పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారు రూ. 3000/-లు జీవితచందా చెల్లించి గ్రంథాలయ సర్వస్వం మాసపత్రిక గ్రంథాలయముకు బహుకరించినారు.

పుస్తకములు బహుకరించిన దాతలు : ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా 31 వాల్యూములు డాక్టర్ రావు వి.బి.జె చెలికాని హైదరాబాద్ వారు బహూకరించినారు. మరియు జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ (రిటైర్డ్) పి.జి.నాయుడుగారు - 70 పుస్తకములు, దువ్వూరి సాయిబాబాగారు పోతన భాగవతం 5 ప్రతులు మంత్రాల శ్రీనాధంగారు అష్టాదశ పురణాలు, రాయవరపు సీతాలక్ష్మిగారు విలువైన గ్రంథములు బహూకరించిరి.

గ్రంథాలయమందు విలువైన పుస్తకములు :సూర్యరాయాంధ్ర నిఘంటువు 8 వాల్యూములు, శబ్దరత్నాకరము, పదబండపారిజాతము 2 వాల్యూములు, భారత రాజ్యాంగ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, ఆవుల సాంబశివరావుగారి రచన 3 వాల్యూములు.

విద్యార్ధుల పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకములన్నియు ఒక బీరువాలో భద్రపరచి వారికి చదువుకొనుటకు వేరే గది ఏర్పాటు చేయడమైనది. ఇటీవల రూ.5000/-లు గ్రంథాలయ సొమ్ముతో కొత్త పుస్తకములు కొనడమైనది.

4